అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) దక్కించుకొన్న విజయోత్సాహంతో, పార్లమెంట్ ఎన్నికలకు (Parliament Elections) సిద్దం అవుతోన్న కాంగ్రెస్ (Congress) తమ వ్యూహాలకు పదును పెడుతోన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్’ యాత్రకు సిద్దం అయ్యారు.. ఈ యాత్రను అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే. అల్లర్లు చెలరేగిన మణిపుర్ నుంచి శ్రీకారం చుట్టారు..
గత ఏడాది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో పేరుతో సుమారు 4వేల కిలోమీటర్లు నడిచిన రాహుల్, ఈసారి మణిపుర్ నుంచి ముంబయి వరకు సుమారు 6 వేల 713 కిలోమీటర్లు యాత్ర చేపట్టడం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకు రావలనే సంకల్పంతో రాహుల్ గాంధీ (Rahul Gandhi) ముందుకు సాగుతోన్నట్టు ప్రచారంలో ఉంది.
మరోవైపు ‘భారత్ జోడో న్యాయ్’ యాత్ర (Bharat Jodo Nyay Yatra)ను.. తౌబాల్ జిల్లాలోని ఓ ప్రైవేటు మైదానంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్ర హైబ్రిడ్ పద్ధతిలో చాలా వరకు బస్సులో, కొంతమేర పాదయాత్ర ద్వారా కొనసాగనుందని తెలుస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, సామాజిక న్యాయం వంటి అనేక అంశాలను ఈ యాత్రద్వారా ప్రజల్లోకి తీసుకు వెళ్ళే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.
మరోవైపు గత కొన్ని రోజులుగా మణిపూర్ రగులుతోందని.. ప్రధాని మోదీ ఎందుకు రాలేదని రాహుల్ ప్రశ్నించారు. తాము మణిపూర్ ప్రజల భాదను అర్థం చేసుకున్నామని.. మళ్లీ ప్రశాంతత మణిపూర్ ను తిరిగిచ్చేస్తానని అక్కడి ప్రజలకు మాటిచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారు..
అయితే ‘భారత్ జోడో’ యాత్ర మాదిరిగానే ఇదికూడా ప్రయోజనం కలిగిస్తుందని పార్టీ వర్గాలు ఆశపెట్టుకొన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మొత్తం 15 రాష్ట్రాల్లోని 100 లోక్ సభ నియోజకవర్గాల్లో సాగే భారత్ జోడో న్యాయ్ యాత్ర.. 67 రోజుల్లో 110 జిల్లాలు, 337 శాసనసభ నియోజకవర్గాల్లో 6 వేల 713 కిలోమీటర్లు చుట్టి వస్తోంది. మార్చి 20 లేదా 21 తేదీల్లో ముంబయిలో ముగింపు కానుందని సమాచారం..