తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు(assembly meetings) ప్రారంభమయ్యాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Batti Vikramarka) ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్, ఇంధన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే భట్టి మూడు శాఖలకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తూ సంతకాలు చేశారు. ఆయా శాఖలకు సంబంధించిన నిధులను ఆయన వెంటనే విడుదల చేశారు.
మరోవైపు, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ప్రసాద్ కుమార్ (Prasad Kumar) ఎన్నిక అయినట్లు ప్రోటెమ్ స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను సీఎం రేవంత్‌రెడ్డి,డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క,మంత్రులు ఆయనను స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా కడియం శ్రీహరి, కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పద్మా రావు గౌడ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు కేటీఆర్, కడియం శ్రీహరితోపాటు అన్నిపార్టీలకు చెందిన సభ్యులకు స్పీకర్ అభినందించారు. కాగా, వారితో పాటు రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క కూడా నేడు భాద్యతలు స్వీకరించారు.
ఇక, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సబ్సీడీ నిధులు రూ.374 కోట్లను విడుదల చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.298 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.996 కోట్లు, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు, పంచాయితీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ హనుమంతరావు, కార్యదర్శి స్మితా సబర్వాల్ మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు.