భువనగిరి (Bhuvanagiri) బీజేపీ (BJP) పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ (Boora Narsaiah Goud) సినిమా లవర్స్‌కు శుభవార్త చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో నిజాం కాలంనాటి పరిస్థితులను, రజాకార్ల అకృత్యాలను చూపించిన ‘రజాకార్’ సినిమాను (Razakar Movie) ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు ప్రకటించారు..
కాగా రేపు జిల్లాలోని వలిగొండ మండలం వెంకటేశ్వ థియేటర్‌లో ఈ చిత్రాన్ని మార్నింగ్, మాట్నీ షోలో ఉచితంగా ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు.. మరుగున పడిన తెలంగాణ చరిత్రను ప్రతి ఒక్కరూ రజాకార్ సినిమా ద్వారా తెలుసుకోవాలని సూచించిన బూర నర్సయ్య గౌడ్.. ఆ నాటి పరిస్థితులను అర్థం చేసుకోవాలని.. అంతటి కష్టాల నుంచి ఇప్పటి వరకు సాగి తెలంగాణ ప్రజల ప్రయాణంలో ఉన్న మలుపులను గుర్తించాలని అన్నారు..
మరోవైపు తెలంగాణ (Telangana) ప్రాంతంలో నిజాం కాలంనాటి పరిస్థితులను, రజాకార్ల అకృత్యాలను చూపించిన ఈచిత్రం మొదటి నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. అంతేగాక పలు వివాదాల్లో కూడా ఇరుక్కుంది.. కాగా ఈ చిత్ర నిర్మాత బీజేపీ నేత అయిన గూడూరు నారాయణ రెడ్డి (Gudur Narayana Reddy)కి బెదిరింపు కాల్స్ సైతం వచ్చినట్లు సమాచారం.. ఈమేరకు దాదాపు 1100 బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆయన కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ క్రమంలో కేంద్ర హోం శాఖ ఆయనకు 1+1 సీఆర్పీఎఫ్ జవాన్‌లతో సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా యాటా సత్యనారాయణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా.. ప్రముఖ నటి ఇంద్రజ, యాంకర్ అనసూయ కీలక పాత్రలు పోషించారు.. గత చరిత్రను కళ్ళకు కట్టినట్లు చూపించిన ఈ చిత్రం మిక్సింగ్ టాక్ సొంతం చేసుకొంది..