Telugu News » Nara Bhuvaneswari: చంద్రబాబుతో భువనేశ్వరి ములాఖత్

Nara Bhuvaneswari: చంద్రబాబుతో భువనేశ్వరి ములాఖత్

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టై 9 రోజులు అయ్యింది. 14 రోజుల రిమాండ్ నిమిత్తం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు.

by Prasanna
Bhuvaneswari

స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు (Skill Development Case)లో అరెస్టై రిమాండులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం ములాఖత్ సమయంలో చంద్రబాబును ఆయన సతీమణి భువనేశ్వరీ (Nara Bhuvaneswari), నారా బ్రాహ్మణితోపాటు టీడీపీ సీనియర్ లీడర్ యనమల రామకృష్ణ కలవనున్నారు. వీరంతా ఇప్పటికే రాజమండ్రి చేరుకున్నారు. దాదాపు 30 నిమిషాలపాటు మాట్లాడేందుకు జైలు అధికారులనుంచి అనుమతి కూడా తీసుకున్నారు.

Bhuvaneswari

స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టై 9 రోజులు అయ్యింది. 14 రోజుల రిమాండ్ నిమిత్తం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. సోమవారం నుంచి వచ్చే శనివారంలోపు 2 ములాఖత్‌లకు జైలు అధికారులు అవకాశం కల్పించారు.

గతవారంలో సూపర్ స్టార్ ములాఖత్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ చంత్రబాబును కలుస్తారన్న వార్తలు వినిపించాయి. అయితే అది వాస్తవ రూపంలోకి రాలేదు. కొన్ని ముఖ్యమైన ఫ్యామిలీ ఫంక్షన్స్ కి హాజరుకావాల్సి ఉండటంతో చంద్రబాబుని కలవడానికి వెళ్లలేకపోతున్నానని రజనీకాంత్ తమిళ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

ఇది ఇలా ఉండగా…చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, కేవలం కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్ చేసినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలోని పలు చోట్ల అందోళనలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం తప్పు చేశారు కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నారని చెప్తోంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ కూడా అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం అలవాటు చేసుకున్న చంద్రబాబుకి ఈ సారి అది కుదరలేదని సీఎం జగన్ అన్నారు.

You may also like

Leave a Comment