వాపును చూసి బలుపు అనుకుంటే పొరబాటు.. అలాగే బలుపు చూసి వాపు అని అనుకున్న ప్రాబ్లమే.. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ (Congress) బీఆర్ఎస్ (BRS)వాలకం కూడా ఇట్టాగే కనిపిస్తుందని జనంలో గుసగుసలు మొదలైయ్యాయి. భారీ చేరికలతో ఈ రెండు పార్టీలు కళకళలాడుతున్నాయి.. అసంతృప్తులు పార్టీ గోడలు దూకుతుండగా.. భేషరతుగా పార్టీల్లో చేర్చుకుంటున్నారు. ఇక్కడ బలం పెరుగుతుంది కానీ పదవులు రాకుంటే అదే అసంతృప్తి పార్టీని ముంచదనే గ్యారంటీ ఏంటి? అనే అనుమానం రాజకీయాలను నిశితంగా గమనిస్తున్న సామాన్యులలో కలుగుతుంది.
మరోవైపు నామినేషన్ పక్రియ మొదలైన ఇంకా వలసలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుందనే వార్తలు పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే (MLA) చిరుమర్తి లింగయ్య (Chirmarthi Lingaiah)కు అత్యంత సన్నిహితులుగా చెప్పబడే నేతలంతా హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం
నకిరేకల్ (Nakirekal) నియోజకవర్గం రామన్న పేట మండలం జడ్పీటీసీ పున్న లక్ష్మీ జగన్మోహన్, మండల పార్టీ అధ్యక్షులు మందడి ఉపేందర్ రెడ్డి.. వీరితో పాటుగా మరో 8 మంది సర్పంచులు, నలుగురు ఎంపీటీసీలు పార్టీ గోడ దూకడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. మండల జడ్పీటీసీ, మండల పార్టీ అధ్యక్షులు ఉపేందర్ రెడ్డి ఇప్పటికే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
కాగా మిగతా సర్పంచులు ఎంపీటీసీలు నాలుగు ఐదు రోజుల్లో కారు దిగి హస్తంతో చేయి కలపనున్నారనే సమాచారం బీఆర్ఎస్ ని కలవర పెడుతుంది. మరి అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య పార్టీ మారుతున్న నేతలకి ఎలా అడ్డుకట్ట వేస్తారో అనే ఆసక్తి స్థానికంగా మొదలైంది… మరోవైపు ఇలా వలసలు జోరుగా సాగుతుంటే బీఆర్ఎస్ హ్యాట్రిక్ కల నెరవేరినట్టే అని బీఆర్ఎస్ అంటే అభిమానం ఉన్న వారు అనుకుంటున్నారు..