పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ(Congress party)కి దేశవ్యాప్తంగా వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి.ఆ పార్టీలో గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న సీనియర్ లీడర్లు కాషాయ పార్టీలో చేరారు. మరికొందరు సొంత కుంపటి ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారు. ఇంకొందరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆ పార్టీ ఢిల్లీ చీఫ్‌గా పనిచేస్తున్న అరవిందర్ సింగ్ లల్లీ (Aravinder Lovely) తన పదవికి రాజీనామా చేశారు.ఈ మేరకు తన రాజీనామా(Resignation) లేఖను ఏఐసీసీ (AICC) పెద్దలకు పంపించారు. ఆయన పార్టీని వీడటానికి బలమైన కారణం ఉందని సమాచారం. మొన్నటివరకు దేశంలో కాంగ్రెస్ పార్టీ నిర్మూలన కోసం పనిచేసిన ఆమ్ ఆద్మీ పార్టీతో హస్తం నేతలు లోకసభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడమే ఇందుకు కారణంగా తెలుంస్తోది.
ఆప్ పార్టీతో పొత్తును ఢిల్లీ కాంగ్రెస్ యూనిట్ వ్యతిరేకించినా అధిష్టానం పొత్తుకే మొగ్గుచూపింది.దీంతో అసహనం వ్యక్తం చేసిన అరవిందర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు సమాచారం. అంతకుముందు ఆప్ తో పొత్తు వద్దని ఏఐసీసీ ఢిల్లీ ఇన్‌చార్జి దీపక్ బాబ్రియాతో కూడా ఇటీవల అరవిందర్ వాగ్వాదానికి దిగారు. అరవిందర్‌సై ఏఐసీసీకి అధికంగా ఫిర్యాదులు అందడంతో ఢిల్లీ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణా చర్యలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది.అయితే, అరవిందర్ 15ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఢిల్లీ సీఎంగా షీలా దీక్షిత్ ఉన్న టైంలో ఆమె కేబినెట్‌లో అరవిందర్ మంత్రిగా పనిచేశారు.2017 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు బీజేపీలో చేరిన అరవిందర్.. తిరిగి ఏడాదికే కాంగ్రెస్ పార్టీలో చేరడంతో అధిష్టానం అతనికి ఢిల్లీ చీఫ్ పదవిని కట్టబెట్టింది.