Telugu News » PM Modi : దటీజ్ మోడీ.. దెబ్బకు విలవిలలాడుతున్న మాల్దీవులు..!

PM Modi : దటీజ్ మోడీ.. దెబ్బకు విలవిలలాడుతున్న మాల్దీవులు..!

ఆ సమయంలో పాకిస్తాన్ కుట్రలకు పాల్పడింది. పంజాబ్, సింధ్, బెంగాల్, హజారాలను తమ దేశంలో విలీనం చేసేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. ఆ సమయంలో లక్ష ద్వీప్‌ ను భారత్ పట్టించుకోలేదు. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న నేపథ్యంలో లక్ష ద్వీప్‌ ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని పాక్ పన్నాగం పన్నింది. తమ యుద్ధనౌకను అక్కడికి పంపింది.

by admin

– మోడీ లక్షద్వీప్ టూర్ తో మాల్దీవులకు భారీ దెబ్బ
– భారత్, మోడీపై నోరు పారేసుకున్న మాల్దీవుల మంత్రులు
– ట్రెండింగ్ లో బాయ్ కాట్ మాల్దీవ్స్
– భారీగా క్యాన్సిల్ అవుతున్న బుకింగ్స్
– లక్ష ద్వీప్ వైపు అడుగులేస్తున్న భారత పర్యాటకులు
– దెబ్బకు దిగొచ్చిన మాల్దీవుల ప్రభుత్వం
– ముగ్గురు మంత్రులపై వేటు
– చైనా టూర్ కు మాల్దీవ్స్ అధ్యక్షుడు

ప్రపంచమే కీర్తిస్తున్న నేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ది టాప్ ప్లేస్. ఏ సర్వే చేసినా, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను లెక్కేసినా.. ఎవరి అంచనాలకు అందకుండా దూసుకెళ్తున్నారు ఆయన. మోడీ ఏం చేసినా ట్రెండింగ్ లో ఉంటుంది. ఈమధ్య లక్ష ద్వీప్ (Laksha Dweep) వెళ్లి నాలుగు ఫోటోలు రిలీజ్ చేయగా ఓ దేశమే గజగజ వణికే పరిస్థితి ఏర్పడింది. చైనా (China) తో అంటకాగుతూ భారత్ (Bharat) కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలను ఎదుర్కొంటోంది మాల్దీవులు (maldives). ఆ దేశానికి ప్రధాన ఆదాయం టూరిజం. దీనికి చెక్ పెట్టేలా మోడీ మాస్టర్ ప్లాన్ వేశారు. అదే లక్షద్వీప్ వైపు భారతీయులను మళ్లించడం. దీంతో ఏం చేయాలో పాలుపోక చైనాకు పరుగులు పెట్టారు ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu).

 

అసలు వివాదం ఏంటి..?

భౌగోళికంగా అత్యంత కీలకమైన సముద్ర ప్రాంతంలో ఉన్న మాల్దీవుల్లో దాదాపు 70 మంది వరకూ భారతీయ సైనికులు ఉన్నారు. రాడార్ల నిర్వహణ, విమానాల నిఘా వంటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఎకనమిక్ జోన్ల గస్తీ దళాలకు సహకరిస్తున్నాయి. విదేశీ దళాల ఉపసంహరణ డిమాండ్‌ తో ఎన్నికల్లో గెలిచిన మహ్మద్ ముయిజ్జు.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. చైనాతో స్నేహం కోసం భారత సైన్యాన్ని వెళ్లిపోవాలని చెబుతున్నారు. భారతదేశ రక్షణకు కీలకమైన ప్రాంతం కావడంతో మాల్దీవులను దారిలోకి తెచ్చుకునేందుకు ప్రధాని మోడీ లక్షద్వీప్ టూరిజంను ప్రమోట్ చేయడం మొదలుపెట్టారు.

మాల్దీవులు ఆదాయంపై దెబ్బ

మాల్దీవులు దేశానికి పర్యటకం నుంచే ఆదాయం వస్తుంది. సంవత్సరానికి 2 లక్షల మందికి పైగా భారత్ నుంచి మాల్దీవ్స్ వెళ్తుంటారు. తాజాగా భారత ప్రధాని లక్షద్వీప్ లో పర్యటించి.. అక్కడకు రావాలని పర్యాటకులకు పిలుపునిచ్చారు. మోడీ పిలుపుతో లక్షద్వీప్ ట్రెండింగ్ లోకి వచ్చింది. అక్కడి పర్యాటకంపై జనం నెట్టింట శోధన మొదలుపెట్టారు. గడిచిన 20 ఏళ్లలో లక్షద్వీప్‌ గురించి ఇంటర్నెట్‌ లో ఈ స్థాయిలో సెర్చ్‌ చేయడం తొలిసారి. జరగబోతున్న ప్రమాదాన్ని పసిగట్టిన మాల్దీవులకు చెందిన మంత్రులు తమ నోటికి పని చెప్పారు. భారత్ టూరిజాన్ని, ప్రధాని మోడీని అవహేళన చేస్తూ మాట్లాడారు.

మంత్రుల మాటలతో మంటలు.. బుకింగ్స్ క్యాన్సిల్

ప్రధాని మోడీ పిలుపు తర్వాత భారత్ ను కించపరుస్తూ మాల్దీవులు మంత్రులు షియూనా, మాల్షా, హసన్ జిహాన్ చేసిన వ్యాఖ్యలపై భారతీయులు భగ్గుమన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఖండించారు. దీంతో లక్ష ద్వీప్ టూరిజం విపరీతంగా పెరిగింది. మాల్దీవులకు తాము బుక్‌ చేసుకున్న టూర్‌ ను రద్దు చేసుకుంటున్నట్లు చాలామంది సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు. దీంతో బాయ్ కాట్‌ మాల్దీవ్స్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్ అయింది. ప్రముఖ ట్రావెల్ కంపెనీ ‘ఈజ్‌ మై ట్రిప్‌’ సైతం మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ దేశానికి అన్ని విమాన బుకింగ్‌ లను నిలిపి వేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది.

మంత్రులపై చర్యలు.. చైనాకు అధ్యక్షుడు

భారతీయులు తమ టూర్ ‎లను రద్దు చేసుకుంటుండడంతో మాల్దీవులు ప్రభుత్వం దిగొచ్చింది. దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ వెల్లడించారు. ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. మన దేశంలోని మాల్దీవుల రాయబారి ఇబ్రహీం షాహిబ్‌ ను వివరణ కోరింది. ఇదే సమయంలో ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ చైనాలో పర్యటించడం హాట్ టాపిక్ గా మారింది. ఇది ఆయనకు మొదటి విదేశీ పర్యటన. చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్ ఆహ్వానం మేరకు ముయిజ్జు వెళ్లారు. వారం రోజుల పాటు చైనా పర్యటనలోనే ఆయన ఉండనున్నారు.

లక్షద్వీప్‌ భారత్‌ లో ఎలా భాగమైందంటే..!

దేశానికి స్వాతంత్ర్యం అనంతరం 500 కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఆ సమయంలో పాకిస్తాన్ కుట్రలకు పాల్పడింది. పంజాబ్, సింధ్, బెంగాల్, హజారాలను తమ దేశంలో విలీనం చేసేందుకు సాయశక్తులా ప్రయత్నించింది. ఆ సమయంలో లక్ష ద్వీప్‌ ను భారత్ పట్టించుకోలేదు. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న నేపథ్యంలో లక్ష ద్వీప్‌ ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని పాక్ పన్నాగం పన్నింది. తమ యుద్ధనౌకను అక్కడికి పంపింది. ఈ విషయం తెలుసుకున్న భారత్‌ కూడా లక్ష ద్వీప్‌ కు సైన్యాన్ని పంపింది. మనోళ్లు ముందే అక్కడకు చేరుకుని భారత జెండాను ఎగురవేసింది. లక్షద్వీప్ లో రెపరెపలాడుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి తోక ముడిచి పారిపోయారు పాక్ సైనికులు. అలా లక్ష ద్వీప్‌ భారత్‌ లో భాగమైంది.

You may also like

Leave a Comment