Telugu News » CPM Narayana: జగన్‌కూ ఇందిరాగాంధీకి పట్టిన గతే: సీపీఐ నారాయణ

CPM Narayana: జగన్‌కూ ఇందిరాగాంధీకి పట్టిన గతే: సీపీఐ నారాయణ

జోరు వానలోనూ సోమవారం అంగన్‌వాడీలు నిరసన కొనసాగించారు. వారికి నారాయణ మద్దతు తెలిపారు. ఎస్మా ప్రయోగిస్తే ఇందిరాగాంధీకి (Indira Gandhi) పట్టినగతే జగన్‌కూ పడుతుందని నారాయణ హెచ్చరించారు.

by Mano
CPM Narayana: Same fate as Jagan and Indira Gandhi: CPI Narayana

అంగన్‌వాడీలపై(Anganwadi Strike) వైసీపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపై సీపీఐ నేత నారాయణ (CPI Leader Narayana) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జోరు వానలోనూ సోమవారం అంగన్‌వాడీలు నిరసన కొనసాగించారు. వారికి నారాయణ మద్దతు తెలిపారు.

CPM Narayana: Same fate as Jagan and Indira Gandhi: CPI Narayana

అనంతరం ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్మా ప్రయోగిస్తే ఇందిరాగాంధీకి (Indira Gandhi) పట్టినగతే జగన్‌కూ పడుతుందని నారాయణ హెచ్చరించారు. జగన్ తల్లి లాంటి అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగిస్తే ఆ పాపం ఊరికేపోదన్నారు.

అదే అతడి నాశనానికి కారణమవుతుందని హెచ్చరించారు. దేశద్రోహులపై, ఎర్రచందనం స్మగ్లర్లపై ఎస్మా చట్టం ప్రయోగించాలని అన్నారు. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ఎస్మా ప్రయోగించారని.. రాజకీయంగా ఆమె పతనమయ్యారని నారాయణ గుర్తుచేశారు.

ఎస్మా చట్టం అమలు చేసి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చేయండని సవాల్ విసిరారు. అదే పని గనక చేస్తే జైళ్లు సరిపోవని.. మీరు అందరికీ అన్నం పెట్టలేరని ఎద్దేవా చేశారు. అంగన్‌వాడీల పోరాటం కొనసాగుతోందని, వారికి మద్దతుగా తాము నిలబడతామని నారాయణ స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment