హైదరాబాద్ (Hyaderabada) రాయదుర్గం (Rayadurgam)లో, సురేందర్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే, ఈ కిడ్నాప్ వ్యవహారంలో పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు.. సురేందర్‌ను అతడి సోదరే కిడ్నాప్ చేయించినట్లు వెల్లడించారు.. రాయదుర్గం పిలిపించి ప్లాన్ ప్రకారం ఆమె కిడ్నాప్ చేయించినట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడిందన్నారు..
సురేందర్‌ను కిడ్నాప్ చేసిన అనంతరం కారులో ఎక్కించుకొన్న నిందితులు..నేరుగా నల్లమల్లకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కర్నూల్ (Kurnool) జిల్లా, ఆత్మకూరు దగ్గర ఈ కారును ఫారెస్ట్ అధికారులు పట్టుకొన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం కిడ్నాపర్ సురేష్‌తో పాటు మరొకరు అదుపులో ఉన్నట్లు సమచారం. మరో ఇద్దరు కిడ్నాపర్ల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు.
మరోవైపు ఈ సంఘటన పై డీసీపీ శ్రీనివాసరావు (DCP Srinivas Rao) స్పందించారు.. ఈ నెల 4వ తేదీ ఉద్యోగి సురేందర్ ని కిడ్నాప్ చేశారని, సమాచారం అందుకొన్న 48 గంటల్లో కేసు ఛేదించామని అన్నారు. కిడ్నాప్ జరుగుతోన్న సమయంలో అక్కడే ఉన్న నికితతో పాటు మరో వ్యక్తిని విచారించమని చెప్పారు. ఇదివరకే నికిత, వెంకటకృష్ణ లకు పరిచయం ఉందని తెలిపిన డీసీపీ.. ఇద్దరు కలిసి సురేష్ తో, కిడ్నాప్ ప్లాన్ చేసినట్టు వెల్లడించారు..
కిడ్నాప్ అనంతరం సురేందర్ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, రెండు కోట్లు అడిగారని తెలిపారు. కాగా కిడ్నాప్ కి పాల్పడ్డ సురేష్ పై 21 కేసులు, వెంకటకృష్ణ పై రెండు కేసులు వున్నాయని డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించినట్టు వివరించారు.. ప్రధాన నిందితుల పై పీడీ యాక్ట్ పెడతామన్నారు.