Telugu News » Bihar Assembly : బలపరీక్షలో గట్టెక్కిన నితీష్ సర్కార్.. మహాఘట్‌బంధన్ కూటమిపై తీవ్ర విమర్శలు..!

Bihar Assembly : బలపరీక్షలో గట్టెక్కిన నితీష్ సర్కార్.. మహాఘట్‌బంధన్ కూటమిపై తీవ్ర విమర్శలు..!

దీంతో ఆయన బలపరీక్షలో సునాయసంగా గట్టెక్కేశారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఇక బల పరీక్ష జరిగే ముందు అసెంబ్లీ స్పీకర్‌ని తొలగించే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ అవాద్ బిహారీ చౌదురిని తొలగించే విషయంలో 125 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేయగా.. వ్యతిరేకంగా 112 ఓట్లు వచ్చాయి.

by Venu
nitish kumar likely to be appointed convenor of india bloc sources

బీహార్ (Bihar) అసెంబ్లీ (Assembly)లో జరిగిన బలపరీక్షలో నితీశ్ కుమార్ (Nitish Kumar) ప్రభుత్వం విజయం సాధించింది. ఈయనకు మద్దతుగా 129 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీలో మొత్తం 243 నియోజకవర్గాలున్నాయి. ఇందులో 122 వస్తే మ్యాజిక్ ఫిగర్ సాధించినట్టు. అయితే నితీశ్‌కి 129 మంది మద్దతు రావడం వల్ల విజయం సాధించినట్టు ప్రకటించారు.

Dont Worry About Us Nitish Kumar Says Will Stay With NDA Work For Development Of Bihar

దీంతో ఆయన బలపరీక్షలో సునాయసంగా గట్టెక్కేశారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఇక బల పరీక్ష జరిగే ముందు అసెంబ్లీ స్పీకర్‌ని తొలగించే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. స్పీకర్ అవాద్ బిహారీ చౌదురిని తొలగించే విషయంలో 125 మంది ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేయగా.. వ్యతిరేకంగా 112 ఓట్లు వచ్చాయి. మరోవైపు ఈ బలపరీక్షకు ముందు ఇక్కడి రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి.

ఎమ్మెల్యేలు NDA కూటమిలోకి జంప్ కాకుండా కాంగ్రెస్ (Congress) జాగ్రత్త పడింది. ఇందుకోసం హైదరాబాద్‌ (Hyderabad) కేంద్రంగా రిసార్ట్ రాజకీయాలు నడిపింది. అటు బీజేపీ నేత నిత్యానంద్ రాయ్ కూడా 78 మంది ఎమ్మెల్యేలను పట్నాలోని ఓ హోటల్‌లో ఉంచారు. నితీశ్ కుమార్ JDU పార్టీ సైతం 40 మంది ఎమ్మెల్యేలను మరో హోటల్‌లో ఉంచి జాగ్రత్తగా కాపాడుకొంది. అయితే జేడీయూకు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలు నితీష్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తారేమోనని ప్రచారం జరిగింది. కానీ మొత్తానికి ఆయన ఫ్లోర్ టెస్ట్‌లో నెగ్గారు.

బల పరీక్ష నెగ్గిన అనంతరం నితీశ్ కుమార్‌ మహాఘట్‌బంధన్ కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. RJD పాలనలో రాష్ట్రంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ హయాంలో జరిగిన అవినీతిపై ప్రస్తుత NDA కూటమి కచ్చితంగా విచారణ చేపడుతుందని తేల్చి చెప్పారు. ఇకపోతే ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడిన మహాకూటమి నుంచి జేడీయూ ఇటీవలే బయటకు వచ్చి ఎన్డీఏతో జతకట్టింది. ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా చేసిన కొన్ని గంటల్లో బీజేపీ మద్దతుతో తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా హిస్టరీ సాధించారు.

You may also like

Leave a Comment