Telugu News » BRS MLAS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు నిరసన సెగలు….!

BRS MLAS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు నిరసన సెగలు….!

గతంలో ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యేలన నిలదీస్తున్నారు. తమ గ్రామాలకు రావద్దంటూ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

by Ramu
Bitter Experience to Brs mla Candidates

తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల (MLA)కు నిరసన సెగ తగులుతోంది. ఇటీవల ఎన్నికల ప్రచారానికి వెళ్తున్న ఎమ్మెల్యేలను గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హామీలపై ఎమ్మెల్యేలన నిలదీస్తున్నారు. తమ గ్రామాలకు రావద్దంటూ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు నిరాశతో వెనక్కి తీరుగుతున్నారు.

తాజాగా జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. సిద్దిపేట జిల్లా కొముర వెల్లి మండలం, తపస్ పల్లిలో ఎన్నికల ప్రచారానికి ఆయన వెళ్లారు. దీంతో ఆయన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని పల్లాపై గ్రామస్తులు ఫైర్ అయ్యారు.

పల్లాకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేశారు. ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేయబోమని గ్రామస్తులు తేల్చి చెప్పారు. తపస్ పల్లి గ్రామాన్ని ఈ సారి ఖచ్చితంగా అభివృద్ధి చేస్తానని పల్లా రాజేశ్వర్​రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు శాంతించారు. ఇది ఇలా వుంటే మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది.

హవేలీ ఘనపూర్ మండల పరిధిలోని గంగాపూర్‌లో ఎన్నికల ప్రచారానికి ఆమె వెళ్లారు. ఎమ్మెల్యే రాకను గమనించి గ్రామస్తులు నిరసన తెలిపారు. సెంటిమెంట్ అంటే మా గ్రామం గుర్తుకు వస్తుంది గానీ.. అభివృద్ధికి మాత్రం మా గ్రామం గుర్తుకు రాదా అని పద్మా దేవందర్ రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు. గ్రామస్తులు నిలదీయడంతో లావణ్య రెడ్డితో పాటు ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయారు.

You may also like

Leave a Comment