Telugu News » Bjp: సీఎం కేసీఆర్‌కు 31 ప్రశ్నలు.. జవాబు ఇవ్వకుంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్!

Bjp: సీఎం కేసీఆర్‌కు 31 ప్రశ్నలు.. జవాబు ఇవ్వకుంటే క్షమాపణలు చెప్పాలని డిమాండ్!

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుఫున బీఆర్ఎస్ 31 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు.

by Mano
BJP: 31 questions to CM KCR.. demand apology if not answered!

నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుఫున బీఆర్ఎస్ 31 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ డిమాండ్ చేశారు. మీరు సమాధానాలు చెప్పకుండా దాటవేస్తే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వంగా, పార్టీగా మీరు ఒప్పుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని సవాల్ విసిరారు. రాష్ట్రంలో బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా బీజేపీ నిరంతరం ప్రజల కోసం పాటుపడుతోందని బండి సంజయ్ అన్నారు.

BJP: 31 questions to CM KCR.. demand apology if not answered!

బండి సంజయ్ 31 ప్రశ్నలు ఇవే..

– మీకు నిజం చెప్పకూడదు అన్న శాపం ఏమైనా ఉందా? అబద్ధాలతో ప్రజలను మోసం చేయడమే లక్ష్యమా?

– 2023, 2018, 2014లో విడుదల చేసిన మేనిఫెస్టోల్లో ఎన్ని అమలు చేశారు? చర్చకు సిద్ధమా?

– మీ మ్యానిఫెస్టో పేజీలు కూడా తగ్గిపోతున్నాయి. ఇది వాస్తవం కాదా?

– కాంగ్రెస్, ఎంఐఎం తో మీరు లోపాయికారి ఒప్పందం వాస్తవం కాదా?

– ఇంటికో ఉద్యోగం ఇస్తామని వాగ్దానం చేసి మీ కుటుంబంలో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఇది వాస్తవం కాదా?

– ప్రభుత్వ ఉద్యోగులకు, టీచర్లకు 1వ తేదీన మీ పాలనలో జీతాలు అందుతున్నాయా?

– అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశారు?

– 2018-2023 వరకు నిరుద్యోగ భృతి ఎంత మంది నిరుద్యోగులకు ఇచ్చారు?

– సెక్రటేరియట్‌కు ఎన్నిసార్లు, ఎన్నిరోజులు వెళ్ళారు?

– ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రిగా మీకు పేరున్న మాట వాస్తవం కాదా?

– 9 సంవత్సరాల కాలంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఎక్కడ అందించారు?

– హామీల మేరకు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ ఎంతమందికి చేశారు?

– రైతులు వరి పండించకుండా అడ్డుకుంది మీరు కాదా? మీ అసమర్థ పాలనకు నిదర్శనం కాదా?

– కేసీఆర్ జమానా ‘అవినీతి ఖజానా” అనే సకలజనులు తెలంగాణలో ఘోషిస్తున్నారు. మీ జవాబు ఏంటి?

– దేశంలోనే అత్యంత అవినీతిపరుడు, ధనవంతుడు కేసీఆర్ అని పేరుంది. మీ నిజాయితీని నిరూపించుకుంటారా?

– మీ కుటుంబసభ్యులు ఇసుక, లిక్కర్, డ్రగ్స్ దందాలు, భూకబ్జాలపై దర్యాప్తుకు మీరు సిద్ధమా?

– ఓటుకు నోటు పథకాన్ని ప్రవేశపెట్టి మీరు సంపాదించిన సొమ్ముతో ఎన్నికల్లో ఖర్చు చేయట్లేదా?

– మీ పార్టీ వారిని బంగారు మయం చేసి ప్రజలను బికార్లుగా మార్చిన ఘనత మీది కాదా..?

– 2014లో మీరు ముఖ్యమంత్రి పదవిచేపట్టే నాటికి మీ ఆస్తులు, మీ కుటుంబ సభ్యుల, మీ బంధువుల ఆస్తులు ఎంత? ఇప్పుడు ఎంత?

– 9 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు? ఎంత మంది పేదలకు ఇచ్చారు? వీటికి లెక్కలు చెప్పగలరా?

– కేంద్ర ప్రభుత్వం 2 లక్షల 91 వేల ఇళ్లను తెలంగాణ రాష్ట్రానికి మంజూరు చేస్తే, అందులో ఎన్ని ఇండ్లను పూర్తి చేశారు?

– గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు..?

– నిజాం షుగర్ పునరుద్ధరణ, నిజామాబాద్ జిల్లాలో చెరుకు పరిశోధనా కేంద్రం, పాలమూరు జిల్లాలో చేపల పరిశోధనా కేంద్రం ఏర్పాటు ఏమైంది?

– పెట్రోల్, డీజిల్ ధరలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎంత ఉన్నాయి, తెలంగాణలో ఎంత ఉంది? దీనిపైన చర్చించడానికి మీరు సిద్ధమా?

– దళితున్ని సీఎం చేస్తానని దళితులను నిట్టనిలువునా మోసగించిన మాట వాస్తవం కాదా?

– ఎస్సీ, ఎస్టీ, సబ్‌ను నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించి ఎస్సీ, ఎస్టీలను మోసగించిన మాట వాస్తవం కాదా?

– బీసీలకు ద్రోహం చేసింది మీరు కాదా? మీరు బీసీ ద్రోహులు. బీసీ, ఎంబీసీ కార్పోరేషన్లకు మీ హయాంలో కేటాయించిన నిధులు ఎంత?

– 2014 నుంచి 2023 వరకు కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాలకు ఎన్ని నిధులు మంజూరు చేసింది, ఎన్ని నిధులు వచ్చాయి? చర్చకు సిద్ధమా?

– కృష్ణా జలాల్లో తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా 299 టీఎంసీల వాటాకు ఒప్పుకుని రాష్ట్రానికి ద్రోహం చేయలేదా?

– గల్ఫ్ కార్మికులను ఆదుకునేందుకు మీ ప్రభుత్వం 9 ఏళ్లల్లో తీసుకున్న చర్యలు ఏమిటి? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

You may also like

Leave a Comment