కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ (L.Murgan) పై డీఎంకే ఎంపీ టీఆర్ బాలు (TR Balu) చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ దుమారం రేగింది. కేంద్ర మంత్రిగా ఉండటానికి మురుగన్ అనర్హుడంటూ టీఆర్ బాలు చేసిన వ్యాఖ్యలను ఎన్డీఏ సభ్యులు తీవ్రంగా ఖండించారు. ఎంపీ వ్యాఖ్యలు దళితులను అవమానించేలా ఉన్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి, అర్జున్ రాం మేఘవాల్‌లు మండిపడ్డారు.
అంతకు ముందు ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగిన నష్టాలపై లోక్ సభలో ప్రశ్నోత్తరాల సమయం నడిచింది. గతేడాది డిసెంబరులో చెన్నై, దాని శివారు ప్రాంతాలు, దక్షిణ తమిళనాడులో వచ్చిన వరదలపై సహాయ చర్యల గురించి డీఎంకే ఎంపీలు ఏ. రాజా, గణేష్‌మూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అనంతరం టీఆర్ బాలు మాట్లాడుతుండగా కేంద్ర మంత్రి మురుగన్ కల్పించుకున్నారు.
ఈ క్రమంలో మురుగన్ పై టీఆర్ బాలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఈ విషయంలో మీరు ఎందుకు ఎంటర్ అవుతున్నారంటూ ఫైర్ అయ్యారు. దయచేసి కూర్చోంది… మీకు ఏం కావాలంటూ కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. అసలు పార్లమెంట్ సభ్యుని పదవికి అనర్హులంటూ మండిపడ్డారు. అసలు మీరు కేంద్ర మంత్రి పదవికి అనర్హులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీఆర్ బాలు వ్యాఖ్యలను కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అర్జున్ మేఘవాల్ లు ఖండించారు. తన సహచరుడిని ఎంపీ అలా అనడం సరికాదని సూచించారు. ఒక దళిత మంత్రిని అసమర్థుడని ఎలా అంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దళితులను అవమానించడమేనన్నారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై దళితులకు టీఆర్ బాలు క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.