ఛత్తీస్గడ్ (Chhattisgarh) సీఎం ఎవరో అనే ఉత్కంఠకు నేటితో తెరపడింది.. బీజేపీ (BJP) అధిష్ఠానం విష్ణుదేవ్ సాయ్ (Vishnudev Sai)ని సీఎంగా ప్రకటించింది. మరో కీలక నేత రమణ్‌సింగ్‌కి షాకిచ్చిన కాషాయం.. విష్ణుదేవ్ సాయ్కు అవకాశం ఇచ్చింది. ఛత్తీస్గడ్ సీఎంగా ఎవరిని ప్రకటించాలనే అంశంపై.. బీజేపీ నుంచి ఎన్నికైన 54 మంది కొత్త ఎమ్మెల్యేలతో అధిష్టానం రాయ్‌పూర్‌లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం అనంతరం విష్ణుదేవ్ సాయ్ పేరును అధికారికంగా ప్రకటించారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాలకు నవంబర్ 7,17 వ తేదీన రెండు విడుతల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 35 స్థానాల్లో గెలవగా.. బీజేపీ 54 స్థానాలకు దక్కించుకుంది. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ సీఎం పదవి కోసం పలువురు సీనియర్ నేతలు పోటీ పడ్డారు. వీరందరిని కాదని విష్ణుదేవ్ సాయికి పగ్గాలు అప్పచెప్పింది బీజేపీ అధిష్టానం..
మరోవైపు విష్ణుదేవ్ గిరిజన వర్గాల్లో బలమైన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అదీగాక ఇదివరకే నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రధాని మోదీ తొలి కేబినేట్లో కేంద్రమంత్రిగా, అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్‌సింగ్‌కు మళ్లీ అధికారం వస్తుందని అంతా భావించారు. కానీ చివరికి రమణ్‌సింగ్‌ను పక్కన పెట్టిన బీజేపీ అగ్రనేతలు, విష్ణు దేవ్ సాయ్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించారు.
అయితే గత వారం రోజులుగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి ఎంపిక కోసం కోసం బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తుంది.. మొత్తానికి ఈరోజు సీఎం ఎంపికకు ముగింపు పలికింది. ఇక బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో కూడా గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి పదవి పై ఇంకా క్లారిటీ రాలేదు.. అయితే బీజేపీ హైకమాండ్ త్వరలోనే ఈ రెండు రాష్ట్రాల సీఎంల పేర్లు ప్రకటించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది..