Telugu News » BRS : బీజేపీ- కాంగ్రెస్ కుమ్మక్కైంది.. ఇదిగో సాక్ష్యమంటున్న బీఆర్ఎస్!

BRS : బీజేపీ- కాంగ్రెస్ కుమ్మక్కైంది.. ఇదిగో సాక్ష్యమంటున్న బీఆర్ఎస్!

తెలంగాణ రాజకీయాలు ప్రజలను గందరగోళంలో పడవేయడంలో ఎల్లప్పుడూ ముందుంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ ఇదే జరిగింది. అప్పటి ప్రతిపక్ష .. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్(Congress) ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే

by Sai
BJP-Congress colluded.. Here is BRS as a witness!

తెలంగాణ రాజకీయాలు ప్రజలను గందరగోళంలో పడవేయడంలో ఎల్లప్పుడూ ముందుంటాయి. గత అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ ఇదే జరిగింది. అప్పటి ప్రతిపక్ష .. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్(Congress) ఎన్నికల ప్రచారంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అనే నినాదంతో వెళ్లి విజయం సాధించింది. అయితే, కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టడంలో బీజేపీ(BJP), బీఆర్ఎస్ (BRS) కాస్త వెనకబడ్డాయని చెప్పవచ్చు.

BJP-Congress colluded.. Here is BRS as a witness!

ప్రస్తుతం ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కూడా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే నినాదాన్ని కాంగ్రెస్ ప్రొజెక్ట్ చేయాలని భావించింది. కానీ, ఇప్పుడు ఆ నినాదం వర్కౌట్ అవ్వదని నిర్ణయానికి వచ్చింది. ఎందుకంటే కవితను ఈడీ అరెస్టు చేయలేదు కాబట్టి జనాలు సులువుగా నమ్మేశారు. కానీ ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కాం కేసులో అరెస్టు అయ్యి తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

అందుకే కాంగ్రెస్ పార్టీ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీని విడివిడిగా టార్గెట్ చేస్తోంది. అయితే, బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే అనే నినాదాన్ని తాజాగా గులాబీ నేతలు ఎంచుకున్నారు. ఎందుకంటే తమ వద్ద అందుకు తగిన సాక్ష్యం ఉందని అంటున్నారు. తాజాగా బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేసింది.

https://x.com/BRSparty/status/1777190506486980987

అందులో ఎమ్మెల్సీ, NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడినట్లు ఉన్న ఓ న్యూస్ పేపర్ క్లిప్‌ను ట్వీట్ కు జతపరిచింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అక్రమంగా అరెస్టు చేశారని, అతన్ని విడుదల చేయాలని ఎమ్మెల్సీ వెంకట్ కోరుతున్నట్లు ఉంది.అందుకు కాంగ్రెస్ సంఘీభావం తెలపడంపై బీఆర్ఎస్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా మండిపడింది.

BJP-Congress colluded.. Here is BRS as a witness!

లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ ఒక్కడే అక్రమంగా అరెస్టు కాలేదని, ఎమ్మెల్సీ కవిత కూడా అక్రమంగానే అరెస్టు అయ్యారని.. కేజ్రీవాల్ మీద ఉన్న సంఘీభావం కవిత మీద ఎందుకు లేదని, ఆమెను విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్-బీజేపీ కుమ్మక్కయ్యారని, అందుకే ఇలాంటి నీచపు పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది.

You may also like

Leave a Comment