తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ దాదాపుగా తమ అభ్యర్థులను ప్రకటించేశాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ (BJP) తుది జాబితాను(Final List) విడుదల చేసింది. ఈ జాబితాలో 14 మంది అభ్యర్థులకు టికెట్లను కేటాయించింది. ఈ లిస్టులో చాంద్రాయణగుట్ట, బెల్లంపల్లి, వనపర్తి అభ్యర్థుల పేర్లను మార్చింది.
బెల్లంపల్లి – కొయ్యల ఎమాజీ, పెద్దపల్లి – దుగ్యాల ప్రదీప్, సంగారెడ్డి – దేశ్‌పాండే రాజేశ్వరరావు, మేడ్చల్ – ఏనుగు సుదర్శన్ రెడ్డి, చాంద్రయాణగుట్ట – కె. మహేందర్, మధిర – విజయరాజు, మల్కాజ్‌గిరి – ఎన్.రామచంద్రరావు, శేరిలింగంపల్లి – రవికుమార్ యాదవ్, నాంపల్లి – రాహుల్ చంద్ర, సికింద్రాబాద్ కంటోన్మెంట్ – శ్రీ గణేశ్ నారాయణ్, దేవరకద్ర – ప్రశాంత్ రెడ్డి, నర్సంపేట – పుల్లారావు, వనపర్తి – అనుజ్ఞా రెడ్డి, అలంపూర్ – మేరమ్మ.
ఇప్పటి వరకు బీఆర్ఎస్ 119 నియోజకవర్గాల్లో, కాంగ్రెస్ పార్టీ 118 నియోజకవర్గాల్లో, బీజేపీ 100 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. బీజేపీ ప్రకటించిన ఈ జాబితాతో 114మంది అభ్యర్థులు ఖరారయ్యారు. మరోవైపు అసెంబ్లీ సీటు దక్కకపోవడంతో ఇన్నిరోజులు ఎన్నో ఆశలు పెట్టుకున్న నేతలు ఆగ్రహావేశంతో మరిగిపోతున్నారు.
కొందరు పార్టీకి రాజీనామా చేస్తుండగా మరికొందరు అధినేతల ఇళ్లను ముట్టడిస్తూ నిలదీస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు బుజ్జగింపులు చేసే పనిలో ఉన్నాయి. అసతృప్త నేతలపై ఓ కన్నేసి ఉంచాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొందరు నేతలు పార్టీ డిపాజిట్లకే ముప్పు తెచ్చే ప్రమాదం ఉన్నందున వారిని దారిలోకి తెచ్చుకుంటే మంచిదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.