Telugu News » Bjp first list: నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. 65మందికి ఛాన్స్‌!

Bjp first list: నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా.. 65మందికి ఛాన్స్‌!

రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు పలు దఫాలుగా సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే ఛాన్స్‌ కనిపిస్తోంది. అందులో 65మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నారు.

by Mano
Bjp first list: Today is the first list of BJP candidates.. 65 people have a chance!

ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై బీజేపీ(Bjp) కసరత్తు తుది దశకు చేరుకుంది. పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్‌చార్జి ప్రకాశ్‌ జావ్‌డేకర్‌ ఆయన నివాసంలో గురువారం రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు పలు దఫాలుగా సమావేశమై చర్చించిన విషయం తెలిసిందే. నేడు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసే ఛాన్స్‌ కనిపిస్తోంది. అందులో 65మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించనున్నారు.

 Bjp first list: Today is the first list of BJP candidates.. 65 people have a chance!

ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జులు తరుణ్‌ ఛుగ్‌, సునీల్‌ బన్సల్‌, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ తదితరులు హాజరయ్యారు.

ముఖ్య నేతలు పోటీ చేసే నియోజకవర్గాలు, ఎక్కువ మంది టికెట్‌ ఆశిస్తున్న స్థానాలు, సామాజికవర్గాల పరంగా సీట్ల కేటాయింపుపై ఈ సందర్భంగా చర్చించారు. అనంతరం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ కోర్‌ కమిటీ సభ్యులు పలుమార్లు భేటీ అయ్యారు. గురువారం రాత్రి జేపీ నడ్డా నివాసంలో కోర్‌ కమిటీ మరోసారి సమావేశమైంది. ఈ సమావేశానికి అమిత్‌షా హాజరయ్యారు.

అన్ని స్థానాలపై కోర్‌ కమిటీ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినా నేడు ఉదయం 11 గంటలకు మరోసారి నడ్డాతో సమావేశమైన తర్వాత తుది జాబితాను సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. ఆ జాబితాను ఇవాళ సాయంత్రం నిర్వహించే బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి పంపనున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ, నడ్డా, అమిత్‌ షా, లక్ష్మణ్‌తో పాటు ఇతర సభ్యులు పాల్గొననున్నారు.

You may also like

Leave a Comment