ఇటీవల పార్లమెంటుకు జరిగిన రెండు దశల పోలింగ్ లోనూ బీజేపీ(BJP)కి స్పష్టమైన మెజార్టీని ప్రజలు కట్టబెట్టారని ప్రధాని మోడీ(PM MODI) అన్నారు. ఆదివారం మహారాష్ట్రాలోని కొల్హాపూర్‌లో ఆయన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం నిర్వహించారు.
2024 పార్లమెంట్ ఎన్నికల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేసే ప్రతిపక్ష నాయకులకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని మోడీ పేర్కొన్నారు. ఒకవేళ ఇండియా కూటమి పొరపాటున అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు మారుతారని ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం నకిలీ శివసేన పార్టీ కాంగ్రెస్(CONGRESS)తో మహారాష్ట్ర(MAHARASTRA)లో పొత్తు పెట్టుకుందని… ఈ విషయం శివసేన(SHIVASENA) వ్యవస్థాపకులు బాల్ థాకరేకు తెలిస్తే కుమిలిపోతారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కర్ణాటక మోడల్‌ను అమలు చేద్దామని చూస్తోందన్నారు.
ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం ఆ పార్టీ పరితపిస్తోంది. వారసత్వ, పన్ను, సంపద తిరిగి పంపిణీ చేయాలని చెబుతూ ప్రజల సొమ్మును మింగేసే ఆలోచనలో ఆ పార్టీ నేతలు ఉన్నారన్నారు. ఇప్పటివరకు జరిగిన రెండు దశ పోలింగ్ లోనూ బీజేపీ ఆధిక్యంలో ఉందన్నారు. కొల్హాపూర్‌ను ఫుట్ బాట్ హబ్‌గా పిలుస్తారు. ప్రస్తుతం ఎన్డీయే ‘2-0’ మెజార్టీ సాధించిందన్నారు.
దేశవ్యతిరేక విధానాలు, విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ కూటమి రెండుసార్లు సెల్ఫ్ గోల్ వేసుకుందని ప్రధాని మోడీ విమర్శించారు. ఆర్టికల్ 370ని తిరిగి తెస్తామని, సీఏఏను రద్దు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫోస్టోలో పెట్టిందని.. మోడీ తీసుకున్న నిర్ణయాలను ఎవరైనా మార్చగలరా? అలా చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయో వారికి తెలియదా? ఇలాంటి వారి ఓటుతో బుద్ది చెప్పాలని మోడీ పిలుపునిచ్చారు.