Telugu News » WORK From Home : వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు హెచ్చరిక.. మీ ‘లివర్’ భద్రమో కాదో చెక్ చేసుకోండి!

WORK From Home : వర్క్‌ఫ్రమ్ హోమ్ ఉద్యోగులకు హెచ్చరిక.. మీ ‘లివర్’ భద్రమో కాదో చెక్ చేసుకోండి!

కరోనా మహమ్మారి సమయం నుంచి ప్రపంచ వ్యాప్తంగా వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home culture) కల్చర్ అనేది పుట్టుకొచ్చింది. నేటికి కొన్ని కంపెనీలు ఈ సంప్రదాయాన్ని పాటిస్తుండగా.. ఇండియాలోని పెద్ద పెద్ద కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను ఆఫీసులకు పిలిపిస్తున్నాయి.టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీలు నేటికి తమ ఉద్యోగులకు ఇంటి నుంచి జాబ్ చేసే సౌలభ్యాన్ని కలిపిస్తున్నాయి.

by Sai
Warning to work from home employees.. Check if your 'liver' is safe or not!

కొన్ని కంపెనీలు మాత్రం హైబ్రిడ్ కల్చర్ ( మూడు రోజులు ఆఫీసు నుంచి) మిగతా రోజులు ఇంటి నుంచి పనిచేసే సౌలభ్యాన్ని కలిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ కల్చర్‌కు ప్రాధాన్యతను ఇస్తున్నాయి. ఆఫీసుకు వచ్చి పనిచేయని వారికి అలవెన్సులు, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ వలన గతంలో కరోనా టైంలో ప్రొడక్టవిటీ పెరిగినా.. ఇంటి నుంచి ఉద్యోగం చేసే వారు చాలా మంది అనారోగ్యం బారిన పడుతున్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట 8 గంటల వర్క్‌ను 12 గంటలు చేయాల్సి వస్తుంది. దీంతో వారి శరీరంలోని అవయవాలు దెబ్బతింటున్నట్లు వైద్యుల పరిశోధనలో వెల్లడైంది.

ఆఫీసు నుంచి పనిచేసే వారితో పోలిస్తే ఇంటి నుంచి పనిచేసే వారిలో ‘ఫ్యాటీ లివర్’(fatty Liver Disease) ముప్పు అధికంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కదలకుండా కూర్చోవడం, ఆహారపు అలవాట్లే ఇందుకు కారణమని తేల్చారు. కాలేయంలో కొవ్వు పెరిగి గడ్డలుగా మారి లివర్ సిరోసిస్‌కు దారి తీస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఇద్దరిలో ఒకరికి ఈ సమస్య ఎదువుతోందని తెలిపారు. అధిక బరువు, షుగర్, థైరాయిడ్ ఉన్న వారిలో ఫ్యాటీ లివర్ వ్యాధి పెరుగుతోందని, ప్రతిరోజూ అరగంట పాటు వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులు వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

You may also like

Leave a Comment