కొద్ది రోజుల క్రితం అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది బీజేపీ (BJP). మొత్తం 52 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో బీసీలతో పాటు కొందరు సీనియర్లకు స్థానం కల్పించింది. ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. కరీంనగర్ (Karimnagar) నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపూరావు, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. అయితే.. ఇంకొంతమంది సీనియర్ల పేర్లు లేకపోవడంతో బీజేపీ రెండో లిస్ట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ, అధిష్టానం ట్విస్ట్ ఇచ్చింది.
తాజాగా రెండో జాబితాను ప్రకటించింది బీజేపీ. ఈ మేరకు శుక్రవారం ప్రకటనను విడుదల చేసింది. అందులో కేవలం ఒకే ఒక్క అభ్యర్థి పేరును మాత్రమే వెల్లడించింది. మహబూబ్ నగర్ (Mahabubnagar) అసెంబ్లీ స్థానం నుంచి ఏపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) ని ఖరారు చేసినట్లు తెలిపింది. ఈయన మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి (Jitender Reddy) కుమారుడు.
నిజానికి, షాద్ నగర్ టికెట్ ఆశించారు మిథున్ రెడ్డి. అలాగే, మహబూబ్ నగర్ నుండి జితేందర్ రెడ్డి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ, అధిష్టానం మహబూబ్ నగర్ సీటును ఆయన కుమారుడికి అప్పగించింది. దీంతో జితేందర్ రెడ్డిని ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ప్రకటించిన 52 మంది అభ్యర్థుల తొలి జాబితాతో పార్టీలో లుకలుకలు బయటపడ్డారు. కొందరు నేతలు గుడ్ బై చెప్పారు. దీంతో ఆచితూచి అడుగులు వేస్తోంది అధిష్టానం.
The Central Election Committee of the Bharatiya Janata Party has decided one name for the ensuing General Elections to the Legislative Assembly of Telangana. pic.twitter.com/sMt3JwkHis
— BJP (@BJP4India) October 27, 2023