పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్(Mp LaXman) కీలక వ్యాఖ్యలు చేశారు.శనివారం నాంపల్లిలోని బీజేపీ(BJP) రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ తప్పకుండా వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్రంలోని మోడీ నినాదమైన ‘వికసిత్ భారత్ తరహాలోనే వికసిత్ తెలంగాణ’ (Vikasith Telangana)పత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా 102 ఎంపీ స్థానాలకు పోలింగ్ పూర్తవ్వగా.. 21రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి చూస్తుంటే మోడీ మేనియా స్పష్టంగా కనిపిస్తోందని వివరించారు.
ఈ ఎన్నికల్లో మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేయడం వల్లే 63శాతం ఓటింగ్ నమోదైందన్నారు. శుక్రవారం జరిగిన ఓటింగ్ లో 50 శాతానికి పైగా బీజేపీ విజయం కనిపిస్తోందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు తెలంగాణలో 12 సీట్లు గెలుస్తామనే నమ్మకం వచ్చిందన్నారు. మోడీ చరిష్మను బీఆర్ఎస్,కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు.
20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే లు మాతో టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు.ఆలోపే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్లో చేరారు.అ భద్రతా భావనలో రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు.
రేవంత్ రెడ్డి పాలన ఓటమికి దారులు వెతుకుంటున్నట్లు కనిపిస్తోంది. నవంబర్, డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయని, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ జోస్యం చెబుతున్నారు. ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేసేందుకు ఈ రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయి.కేసీఆర్ బస్సు యాత్ర కాదు, మొకాళ్ళ యాత్ర చేసిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగయ్యే పరిస్థితుల్లో ఉంది.కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోతుందని జోస్యం చెప్పారు.