Telugu News » Kishan Reddy : రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కనుమరుగవుంది… కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ….!

Kishan Reddy : రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కనుమరుగవుంది… కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ….!

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

by Ramu

రాబోయే లోక్​సభ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పోటీ బీజేపీ (BJP), కాంగ్రెస్​ (Congress) మధ్యే ఉంటుందని తెలంగాణ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణకు బీఆర్​ఎస్​, కేసీఆర్​ ఆవశ్యకత అవసరం లేదన్నారు. భవిష్యత్ లో రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు.

రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కనుమరుగవుంది

రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ కనుమరుగవుంది

 

రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటిస్తారని చెప్పారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి అధ్యక్షత వహించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….. ఈ నెల 22న దేశమంతట రామజ్యోతులతో కళకళలాడాలని రామజన్మ భూమి ట్రస్ట్ పిలుపునిచ్చిందని వెల్లడించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి దేవాలయ కమిటీ సహకరించాలని కోరారు. రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో తెలంగాణ భాగస్వామ్యం కావాలని నిర్ణయించామన్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించేలా ప్రతి దేవాలయంలో భారీ తెరలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

సంక్రాంతి నుంచి ఈ నెల 22 వరకు దేవాలయాల్లో స్వచ్ఛ అభియాన్ పేరిట కార్యక్రమాన్ని చేపడతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సీబీఐ విచారణ కోరడం లేదని ప్రశ్నించారు. బీజేపీ దాటికి తట్టుకోలేక కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారని, విదేశాలకు పారిపోయారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇంఛార్జ్ లను నియమించనున్నట్లు పేర్కొన్నారు. ఆర్గనైజేషన్​ ఇంచార్జీలను రేపు ప్రకటిస్తామన్నారు.

ఇది ఇలా వుంటే 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జ్‌లను బీజేపీ నియమించింది. ఇందులో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి, సీనియర్‌ నాయకులను ఇంఛార్జ్ లుగా నియమించారు. వారిలో సికింద్రాబాద్ ఇంఛార్జ్‌గా ఎంపీ లక్ష్మణ్‌, హైదరాబాద్ ఇంఛార్జ్‌గా రాజాసింగ్, ఖమ్మానికి పొంగులేటి సుధాకర్ రెడ్డి, మహబూబాబాద్ కు గరికపాటి మోహనరావు, వరంగల్ కు మర్రి శశిధరరెడ్డిని నియమించారు. ఇక కరీంనగర్ బాధ్యతలు ధనపాల్ సూర్యనారాయణ గుప్తాకు అప్పగించారు.

You may also like

Leave a Comment