సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద (Jayaprada) కనిపించడం లేదంటూ (Missing) వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఎక్కడకు వెళ్లారనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ రావడం లేదు. ఆమెపై పై నాన్ బెయిలబుల్ (Non Bailable Warrant) అరెస్టు వారెంట్ జారీ కావడంతో ఈ వార్త వైరల్ అవుతోంది.
పొలీసులు ఆమె ఇంటికి వెళ్లగా అక్కడ ఆమె లేకపోవడంతో పోలీసులు ఆమె కోసం గాలిస్తుండటంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జయప్రద ఉల్లంఘించారంటూ ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాంపూర్ కోర్టులో విచారణ జరుగుతోంది.
ఈ కేసులో కోర్టు విచారణకు హాజరు కావాలని రాంపూర్ న్యాయస్థానం ఆదేశించింది. కానీ కోర్టు ఎన్ని సార్లు ఆదేశించినా విచారణకు జయప్రద గైర్హాజరవుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జయప్రద తీరుపై కోర్టు ఆగ్రహించిన వ్యక్తం చేసింది. ఈ మేరకు జయప్రదకు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఈ నేపథ్యంలో పోలీసులు జయప్రద ఇంటికి వెళ్లారు. కానీ ఆ సమయంలో అక్కడ జయప్రద లేరు. ఆమె ఎక్కడకు వెళ్లారనే విషయంపై స్పష్ట రాలేదు. దీంతో ఆమె కోసం యూపీ పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. ఆమె కోసం పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పడుతున్నట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది.