Telugu News » Vijayashanti: సీఎం కేసీఆర్ పై పోటీకి రాములమ్మ సిద్దమా..?

Vijayashanti: సీఎం కేసీఆర్ పై పోటీకి రాములమ్మ సిద్దమా..?

కేసీఆర్‌పై పోటీ చేస్తామని బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇప్పటికే సవాల్ చేశారు. గతంలో మెదక్ ఎంపీగా ఉన్న విజయశాంతి కూడా కామారెడ్డి నియోజకవర్గం పై కొంత ప్రభావం చూపారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి సంజయ్, కామారెడ్డి నుంచి విజయశాంతి పోటీ చేయాలని బీజేపీ శ్రేణుల మనసులో మాట అంటున్నారు.

by Venu

తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్ర రాజకీయాలు ఊహించని విధంగా మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే వ్యూహాత్మక నిర్ణయాలతో కేసీఆర్ (KCR) ముందుకు వెల్లుతుండగా కాంగ్రెస్ (Congress) కూడా మంచి జోరులో ఉంది. కాగా బీజేపీ (BJP) కూడా ఫామ్ లోకి వస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం కేసీఆర్ పోటీ చేసే స్థానాల పై దృష్టి సారించింది.

కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో బలమైన నేతలను బరిలోకి దించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే కేసీఆర్‌పై పోటీ చేస్తామని బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇప్పటికే సవాల్ చేశారు. గతంలో మెదక్ ఎంపీగా ఉన్న విజయశాంతి కూడా కామారెడ్డి నియోజకవర్గం పై కొంత ప్రభావం చూపారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ పై గజ్వేల్ నుంచి సంజయ్, కామారెడ్డి నుంచి విజయశాంతి పోటీ చేయాలని బీజేపీ శ్రేణుల మనసులో మాట అంటున్నారు.

ఈ క్రమంలో కేసీఆర్ పై పోటీ చేసే అంశంపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌పై రాజీలేని పోరాటంలో బీజేపీ వెనక్కి తగ్గదని కార్యకర్తలు భావిస్తున్నారు. అందుకే గజ్వేల్‌ నుంచి బండి సంజయ్‌, కామారెడ్డి నుంచి నన్ను కేసీఆర్‌పై పోటీ చేయాలన్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనేది నా ఉద్దేశ్యం కాదు.. అయితే వ్యూహాత్మక నిర్ణయాలను పార్టీ ఎప్పుడూ శాసిస్తుందనేది వాస్తవం అంటూ విజయశాంతి కామారెడ్డి పోటీపై ఇంకా సస్పెన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు.

మరో వైపు ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అభ్యర్థుల వేటలో ఉండగానే కేసీఆర్ రాష్ట్రంలో పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇలా ప్రచారం చేసుకుంటున్న కేసీఆర్ తాను పోటీ చేసే నియోజకవర్గంపై పెద్దగా దృష్టి పెట్టకపోవచ్చు. దీంతో బలమైన అభ్యర్థులను నిలబెట్టి కేసీఆర్ ను ఓడించాలని…తద్వారా జాతీయ రాజకీయాలకు సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీని నైతికంగా దెబ్బతీయాలని బీజేపీ భావిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి.

You may also like

Leave a Comment