Telugu News » BJP : బీజేపీ బీసీ సీఎం నినాదం.. లైన్ లో చాలామంది లీడర్లు!

BJP : బీజేపీ బీసీ సీఎం నినాదం.. లైన్ లో చాలామంది లీడర్లు!

మాస్ లీడర్ గా ఈయనకు గుర్తింపు ఉంది. బీసీల్లోనే కాకుండా బీజేపీ కార్యకర్తల్లో ఫాలోయింగ్ ఉన్న లీడర్. ఈ ముగ్గురితోపాటు విజయశాంతి, అరవింద్, రాజాసింగ్ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.

by admin
eatala laxman bandi

– బీజేపీ బీసీ మంత్రం
– ఓవైపు అత్యధికంగా సీట్ల కేటాయింపు
– ఇంకోవైపు బీసీ సీఎం ప్రకటన
– తెరపైకి చాలామంది పేర్లు
– ప్రముఖంగా ఆ ముగ్గురిపైనే చర్చ

తెలంగాణ (Telangana) లో ఎన్నిక హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. పార్టీలన్నీ గెలుపు వ్యూహాల్లో తలమునకలయ్యాయి. అయితే.. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలను మచ్చిక చేసుకోవడంలో మాత్రం బీజేపీ (BJP) ముందుంది. సీట్ల విషయంలో సీఎం (CM) పదవి విషయంలో ప్రత్యర్థి పార్టీలు ఊహించని రీతిలో అడుగులు వేస్తోంది. ఈసారి అభ్యర్థుల విషయంలో బీఆర్ఎస్ (BRS) 119 స్థానాల్లో 22 మంది బీసీ అభ్యర్థులను మాత్రమే బరిలోకి దింపింది. ఈ సంఖ్యను అధిగమించి సీట్లు ఇస్తామన్న కాంగ్రెస్ (Congress).. ఇప్పటి వరకు 100 మంది అభ్యర్థులను ప్రకటించి 20 మందికి మాత్రమే చోటిచ్చింది. కానీ, బీజేపీ మాత్రం బీసీలకు పెద్దపీట వేస్తోంది.

eatala laxman bandi

బీజేపీ ఇప్పటిదాకా రెండు జాబితాలు విడుదల చేసింది. మొదటి లిస్టులో 52 మంది, రెండో లిస్టులో ఒక పేరును ప్రకటించింది. ఈ 53 మందిలో ముందే చెప్పినట్టు అత్యధికంగా బీసీలకు 19 స్థానాల్లో అవకాశం కల్పించింది. మిగిలిన 66 స్థానాల్లోనూ బీసీలకు ఇంకొన్ని ఇచ్చేందుకు చూస్తోంది. అంతేకాదు, తెలంగాణలో బీజేపీకి అవకాశం ఇస్తే సీఎం అయ్యేది బీసీయే అని ఏకంగా అమిత్ షా (Amit Shah) ప్రకటించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న బీసీలను తమవైపు తిప్పుకునే లక్ష్యంతో కమలం పార్టీ అడుగులు వేస్తోంది. అయితే.. బీసీ సీఎం ప్రకటనతో పార్టీ గెలిస్తే.. ఈ రేసులో ముందుండేది ఎవరనే చర్చ జోరందుకుంది.

బీజేపీలో బీసీ లీడర్లు చాలామందే ఉన్నారు. కానీ, వీరిలో ప్రధానంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. వారే, బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Eatala Rajender), బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay), రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ (Laxman). హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల గెలుపుతో రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అనే టాక్ వచ్చింది. రాజేందర్ హుజూరాబాద్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్‌ లో ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు. బీసీల్లో ఈయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.

ఇక, లక్ష్మణ్, సంజయ్ కు సంఘ్ నేపథ్యం ఉంది. రాష్ట్ర బీజేపీలో సీనియర్ నేతగా కొనసాగుతున్న లక్ష్మణ్.. గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, శాసనసభా పక్ష నేతగా పని చేశారు. ఏబీవీపీలో విద్యార్థి నేతగా ప్రస్థానం మొదలుపెట్టిన బండి.. ఆ తర్వాత బీజేవైఎంలో పని చేసి, బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ అయి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మాస్ లీడర్ గా ఈయనకు గుర్తింపు ఉంది. బీసీల్లోనే కాకుండా బీజేపీ కార్యకర్తల్లో ఫాలోయింగ్ ఉన్న లీడర్. ఈ ముగ్గురితోపాటు విజయశాంతి, అరవింద్, రాజాసింగ్ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.

You may also like

Leave a Comment