బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (BJP MP Laxman) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో తాము ముందున్నామన్న ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ల డీఎన్ఏ ఒక్కటే.. అంటూ వ్యాఖ్యానించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి(Medak MP Kotha Prabhakar Reddy)పై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నామన్నారు. విచారణ జరిపించి బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు. భౌతిక దాడులను ఖండిస్తున్నామన్నారు.
అదేవిధంగా బీజేపీ నేత వివేక్ వెంకటస్వామిపై (Vivekk Venkataswamy) గత ఆరు నెలల నుంచి మీడియాలో వస్తున్న వార్తలపై లక్ష్మణ్ స్పందించారు. వివేక్ బీజేపీలోనే(BJP) ఉంటారని స్పష్టం చేశారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉండి చక్కటి మ్యానిఫెస్టో ఇచ్చారన్నారు. ఆరు నెలలుగా వివేక్‌పై ప్రచారం జరుగుతూనే ఉందని.. వారు ఖండిస్తూనే ఉన్నారని తెలిపారు.
కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ఎందుకు మాట మార్చారో ఆయన్నే అడగాలన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విదేశాల నుంచి రాగానే ఎక్కడెక్కడ పోటీ అనేది స్పష్టత వస్తుందని తెలిపారు. తెలంగాణలో జనసేనతో పొత్తు ఉంటుందని మరోసారి చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లిస్ నేతృత్వంలో బీజేపీని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లల్లో చీలిక తెచ్చేందుకు కాంగ్రెస్‌ను బీఆర్ఎస్ పావుగా వాడుకుంటోందని విమర్శించారు.
కుటుంబ వారసత్వ రాజకీయాలకు పర్యాయ పదాలు కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు కలిసి గేమ్ ఆడుతున్నాయన్నారు. బీజేపీని బూచిగా చూపిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు వేసినట్లే అని అన్నారు. మతోన్మాద ఎంఐఎంకు పాలు పోయొద్దన్నారు. కాంగ్రెస్ కరెంట్ హామీలు ప్రజలను అంధకారంలోకి నెట్టేస్తున్నాయన్నారు. గ్యారంటీ లేని కాంగ్రెస్ 6 గ్యారంటీ లను చూసి మోసపోవద్దని సూచించారు.