కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్(Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో కొలువు తీరిన మోడీ ప్రభుత్వం తాజాగా ఇండియా(INDIA) పేరును మారుస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో భారత్ ను చేరుస్తున్నట్లు స్పష్టం చేసింది. జీ 20 శిఖరాగ్ర సమావేశం సందర్బంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పేరుతో కాకుండా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో అన్ని దేశాలకు ఆహ్వానం పంపింది.
దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది. మోడీ, బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా దేశంలోని 28 పార్టీలన్నీ కలిసి ఇండియా పేరుతో కూటమిని ఏర్పాటు చేశారు. దీనిని తట్టుకోలేకే మోడీ ఇండియా పేరును మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారంటూ ఆరోపించారు. ఈ తరుణంలో ఎంపీ శశి థరూర్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
భారత్ ను ప్రతిపక్ష కూటమిగా అభివర్ణించారు. భారత్ అని పిలిచేందుకు రాజ్యాంగ పరంగా ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. కానీ వెల కట్ట లేని బ్రాండ్ వాల్యూ మాత్రం ఇండియా పేరు మీదే ఉందన్న విషయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు శశి థరూర్. ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
కేంద్రం ఇండియా పేరును భారత్‌గా మారిస్తే తాము కూటమి పేరును I.N.D.I.A బదులుగా బెటర్మెంట్, హార్మొనీ అండ్ రెస్పాన్సిబుల్ అడ్వాన్స్మెంట్ ఫర్ టుమారో అని పిలుస్తామని ఎక్స్ (ట్విటర్లో)లో పేర్కొన్నారు. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని రాష్ట్రపతి నుంచి G20 అధినేతలకు విందు ఆహ్వానం వెలువడినప్పడి నుంచి బీజేపీ దేశం పేరు మార్చేందుకు యత్నిస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇందుకోసమే సెప్టెంబర్ 18-22 మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. ప్రత్యేక సమావేశాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎజెండాను ప్రకటించకపోవడం ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. దీనిపై మంత్రులు ఎవరూ స్పందించవద్దని మోడీ ఆదేశించినట్లు సమాచారం.