Telugu News » Moon: చంద్రుడిపైకి జపాన్ ప్రయాణం…

Moon: చంద్రుడిపైకి జపాన్ ప్రయాణం…

ఈ ప్రయోగం గతంలో చాలా సార్లు వాయిదా వేసిన జపాన్ ఎట్టకేలకు జపాన్ లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది.

by Prasanna
Japan on moon

ఇండియా ఆన్ మూన్ (Moon) అనిపించుకున్నట్లే మరో దేశం జపాన్ (Japan) కూడా సిద్ధమైంది. జపాన్ అన్ మూన్ అనిపించించుకునేందుకు ఆ దేశం చంద్రుడిపైకి పంపిన హెచ్-2ఏ రాకెన్ లూనార్ ల్యాండర్ (Lunar Lander) ను తీసుకుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.

Japan on moon

ఈ ప్రయోగం గతంలో చాలా సార్లు వాయిదా వేసిన జపాన్ ఎట్టకేలకు జపాన్ లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది.

హెచ్-2 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన 13 నిమిషాల తర్వాత భూకక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది. గెలాక్సీల మధ్య వేగం, ఇతర పరామితులను కనుగొనేందుకు ఈ ఉపగ్రహం ప్రయోగించామని, విశ్వ రహస్యాలను ఛేదించేందుకు, ఖగోళ వస్తువులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని జపాన్ చెప్తోంది.

స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ పేరుతో ఓ తేలికపాటి లూనార్ ల్యాండర్ ను కూడా ఈ రాకెట్ లో పంపారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నెలలో ఈ ల్యాండర్ చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని జపాన్ స్పేస్ ఏజెన్సీ తెలిపింది.  ఇది విజయవంతమైతే, చంద్రుడిపై కాలుమోపిన ఐదో దేశంగా జపాన్ చేరుతుంది. చంద్రుడిపై ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, భారత్ లే అడుగుపెట్టాయి.

జాబిల్లిపైకి స్లిమ్ ల్యాండర్ను విజయవంతంగా ప్రయోగించడంపై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జపాన్ కు అభినందనలు తెలిపింది.

You may also like

Leave a Comment