బంతిని నేలపై ఎంత బలంగా కొడితే అది అంత ఎత్తుకు వెళ్తుంది అనేది తెలిసిందే.. అయితే బీజేపీ (BJP)పై కాంగ్రెస్ (Congress) చేస్తున్న తీవ్ర ఆరోపణలు.. తిరిగి అంతే వేగంగా హస్తాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.. లోక సభ ఎన్నికల (Lok Sabha Elections) నేపథ్యంలో రెండు జాతీయ పార్టీల మధ్య మాటల యుద్ధం అదుపు లేకుండా సాగుతుంది. ఈ క్రమంలో బీజేపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు వేస్తున్నారు..
మరోవైపు కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఘాటు వ్యాఖ్యలు చేశారు.. ప్రజల ప్రాథమిక హక్కులను కాంగ్రెస్ హయాంలోనే రద్దు చేశారని ఆరోపించారు. ఇప్పటివరకూ దేశంలో ఆర్టికల్ 356 కింద 132 సార్లు రాష్ట్రపతి పాలన విధించగా అందులో 90 సార్లు కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని వివరించారు.. అలాగే ఇందిరా గాంధీ ప్రభుత్వాలను కూల్చడంలో అర్ధ సెంచరీ సాధించారని పేర్కొన్నారు.
ఆనాడే మహాత్మా గాంధీ ఒక నిర్ణయానికి వచ్చారు.. దేశానికి స్వతంత్రం రాగానే కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని సూచించారు. కానీ ఆ మాటలను పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తుందని రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) ఆరోపించారు.. మహాత్మాగాంధీ చెప్పినవన్నీ నెరవేర్చాలని ఇప్పుడు ప్రజలు ఆలోచించి నిర్ణయించుకొన్నట్లు తాను భావిస్తున్నానని పేర్కొన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ను రద్దు చేయాలని తెలిపిన రక్షణ శాఖ మంత్రి.. ఈ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు.. అసలు అవినీతికి పునాదులు వేసిందే కాంగ్రెస్ అని, ఆ పార్టీ హయాంలో విచ్చలవిడి దోపిడి చోటుచేసుకుందని విమర్శలు గుప్పించారు..