బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ (L.K Advani)కి భారత్ రత్న (Bharat Ratna)ప్రకటిస్తున్నట్టు ప్రధాని మోడీ చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) స్పందించారు. ఓ వైపు అద్వానీకి శుభాకాంక్షలు తెలుపుతూనే మరో వైపు కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించిన తర్వాత బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీకి భారత రత్న ప్రకటించడంతో ఆ పార్టీ ఎజెండా నెరవేరిందని అన్నారు. ‘రామ మందిర నిర్మాణం పూర్తయింది, ఇప్పుడు అద్వానీకి భారత రత్న ఇస్తున్నారని అన్నారు. దీంతో బీజేపీ ఎజెండా పూర్తయిందని’అని అన్నారు.
దేశంలో అత్యున్నత పౌర పురస్కారానికి ఎల్కే అద్వానీని ఎంపిక చేసినందుకు తన హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. మరోవైపు ఎల్కే అద్వానీ గురించి బీజేపీ, ప్రధాన మంత్రి మోడీ చాలా ఆలస్యంగా ఆలోచించారని కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ అన్నారు. ఎల్ కే అద్వానీ గొప్ప నాయకుడని చెప్పారు.
ఈ రోజు బీజేపీ ఉన్న స్థానం, దాని పునాది ఎల్కె అద్వానీ ద్వారా పడిందన్నారు. అంతటి మహోన్నత నేతతో బీజేపీ ప్రవర్తించిన తీరు సరిగా లేదని మండిపడ్డారు. ఆయనకు భారతరత్న రావడం సంతొషంగా ఉందని పేర్కొన్నారు. ఆయనకు శుభాకాంక్షలు సందీప్ దీక్షిత్ అన్నారు.