పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నియోజకవర్గంలో ఈసారి బీజేపీ(BJP) తప్పకుండా విజయం సాధిస్తుందని ఈటల జమున(Etala jamuna) కీలక వ్యాఖ్యలు చేశారు.మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన భర్త ఈటల నామినేషనే పత్రాలకు గురువారం ఉదయం శామీర్ పేట కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు.
ఈ సందర్భంగా ఈటల జమున మాట్లాడుతూ..దేశంలో అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరి(Malkajgiri parliament segment)sssss పార్లమెంట్ స్థానంలో ఈటల రాజేందర్ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని ఆమె ఆకాంక్షించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సమయంలో అన్ని వర్గాల ప్రజలు తమను ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
ఇదిలాఉండగా, నేడు భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అందులో ఒకరు మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. మరొకరు మెదక్ బీజేపీ ఎంపీ అబ్యర్థిగా పోటీ చేస్తున్న దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావులు ఉన్నారు.
ప్రస్తుతమున్న రాజకీయ పరిస్థితుల్లో తెలంగాణలో బీజేపీ పార్టీ ఈసారి డబుల్ డిజిట్ ఎంపీ స్థానాలను తప్పకుండా కైవసం చేసుకుంటుందని కాషాయ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీకి రాష్ట్రంలో మొదటి లేదా రెండో స్థానం దక్కవచ్చని ఇటీవల ఎన్నికవ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించిన విషయం తెలిసిందే.