హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కొనసాగింపు సాధ్యం కాదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) స్పష్టం చేశారు. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి(YCP leader YV Subbareddy) మంగళవారం చేసిన వ్యాఖ్యలను ఆయన స్పందించారు.
అనుభవం ఉన్న నేత ఎవరైనా హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గురించి మాట్లాడతారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదన్నారు. అయినా హైదరాబాద్ రాజధానిగా కొనసాగింపు విషయం సాధ్యం కానిదని తెలిపారు.
హైదరాబాద్ నగరాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆస్తి కాదని విమర్శించారు. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. అర్ధరాత్రి చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి రావడం వల్ల ఇప్పుడు ఏపీకి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు.
రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జూన్‌తో పదేళ్లు పూర్తవుతుందని గడువు ముగియనుంది. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి రాజధాని గడువును మరికొద్ది రోజులు పొడిగించాలని వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.