Telugu News » BrahMos Missile : బంగాళాఖాతంలో బ్ర‌హ్మోస్‌.. ఇండియ‌న్ నేవీ పరీక్ష సక్సెస్..!!

BrahMos Missile : బంగాళాఖాతంలో బ్ర‌హ్మోస్‌.. ఇండియ‌న్ నేవీ పరీక్ష సక్సెస్..!!

నౌక నుంచి ప్రయోగించగలిగే సత్తా ఉన్న బ్రహ్మోస్‌ క్షిపణిని భారత్‌- రష్యాలు సంయుక్తంగా రూపొందించాయి. ఈ క్షిపణులను జలాంతర్గాములు, నౌకలు, విమానాల నుంచి కూడా ప్రయోగించేందుకు వీలుగా రూపొందిస్తున్నారు.

by Venu

సూపర్‌సోనిక్ (Supersonic) క్షిపణి బ్రహ్మోస్‌ మిస్సైల్‌ను (BrahMos Missile) భారత నౌకాదళం ఇవాళ ప‌రీక్షించింది. బంగాళాఖాతంలో యుద్ధ నౌక నుంచి క్షిప‌ణిని విజ‌య‌వంతంగా ప‌రీక్షించినట్టు భార‌తీయ నౌకాద‌ళం (Indian Navy) ప్రకటించింది. అన్ని ల‌క్ష్యాల‌ను ఆ మిస్సైల్ నేర‌వేర్చిన‌ట్లు నౌకాద‌ళ ప్ర‌తినిధి త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో తెలిపారు.

ఇక పూర్తి స్వదేశీ పరిజ్ఞానం (Indigenous knowledge)తో నౌక నుంచి ప్రయోగించగలిగే సత్తా ఉన్న బ్రహ్మోస్‌ క్షిపణిని భారత్‌- రష్యాలు సంయుక్తంగా రూపొందించాయి. ఈ క్షిపణులను జలాంతర్గాములు, నౌకలు, విమానాల నుంచి కూడా ప్రయోగించేందుకు వీలుగా రూపొందిస్తున్నారు.

మరోవైపు, బ్రహ్మోస్‌ క్షిపణులను భారత్ ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తోంది. ఈ క్షిపణుల మూడు బ్యాటరీలు సరఫరా చేసేందుకు గతేడాది జనవరిలో ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్‌ డాలర్ల ఒప్పందం భారత్ కుదుర్చుకుంది. కాగా ధ్వని వేగానికి మూడురెట్ల వేగంతో ఈ క్షిపణి ప్రయాణించగలిగే సామర్థ్యం కలిగి ఉంది. సముద్ర తలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేధించే సామర్థ్యం ఉన్న ఈ క్షిపణిని హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది.

మరోవైపు భారత నావికాదళం 2005 నుండి తన ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలలో బ్రహ్మోస్‌ను చేర్చడం ప్రారంభించింది. ఇక బ్రహ్మోస్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి. దీన్ని బ్రహ్మపుత్ర మరియు మోస్క్వా నదుల పేర్ల కలయికతో, బ్రహ్మోస్ క్షిపణులను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) మరియు రష్యాకు చెందిన మషినోస్ట్రోయెనియా రూపొందించింది..

You may also like

Leave a Comment