Telugu News » Tirumala :  బ్రహ్మోత్సవాల్లో వెంకన్న యోగనరసింహుడి అవతారం

Tirumala :  బ్రహ్మోత్సవాల్లో వెంకన్న యోగనరసింహుడి అవతారం

యోగశాస్త్రంలో సింహం బలానికి, వేగానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహ బలం అంతటి భక్తిని కలిగినప్పుడు - భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.

by Prasanna
Simhavahanam

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలతో (Brahmotsavalu) తిరుమల (Tirumala) మాడవీధుల్లో సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. వీటిలో భాగంగా మూడో రోజైన బుధ‌వారం సింహవాహనాన్ని అధిరోహించిన స్వామివారు యోగనరసింహుడి (Yoganasasimha) అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు

Simhavahanam

శ్రీవారి దశావతారాల్లో నాలుగవది నరసింహ అవతారం. ఈ అవతారంసింహం గొప్పదనాన్ని తెలియజేస్తోంది. యోగశాస్త్రంలో సింహం బలానికి, వేగానికి ప్రతీకగా భావిస్తారు. భక్తుడు సింహ బలం అంతటి భక్తిని కలిగినప్పుడు – భగవంతుడు అనుగ్రహిస్తాడు అని వాహనసేవలో అంతరార్థం.

రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ముత్య‌పుపందిరి వాహనంపై స్వామివారు అభ‌య‌మిస్తారు. మూడో రోజు రాత్రి శ్రీ మలయప్పస్వామివారు ముత్యపుపందిరి వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రం చంద్రునికి ప్రతీకగా ముత్యాలను తెలియజేస్తుంది. శ్రీకృష్ణుడు ముక్కుపై, మెడలో ముత్యాల ఆభరణాలు ధరించినట్టు పురాణాల్లో ఉంది. ఆదిశేషుని పడగలను ముత్యాల గొడుగా పూనిన స్వామివారిని దర్శించినా, స్తోత్రం చేసినా సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. చల్లని ముత్యాల కింద నిలిచిన శ్రీనివాసుని దర్శనం తాపత్రయాలను పోగొట్టి, భక్తుల జీవితాలకు చల్లదనాన్ని సమకూర్చుతుందని తిరుమల అర్చకులు చెప్తారు.

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను చూసేందుకు తెలుగు రాష్ట్రలే కాకుండా దేశం నలుమూలల నుంచీ భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లలు తప్పిపోకుండా వారికి జియో ట్యాగ్ లు ఏర్పాటు చేశామని టీటీడీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి తెలిపారు .

You may also like

Leave a Comment