Telugu News » RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బాగా నచ్చింది: బ్రెజిల్‌ అధ్యక్షుడు!

RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బాగా నచ్చింది: బ్రెజిల్‌ అధ్యక్షుడు!

ఈ సినిమా నిజంగా నన్ను చాలా ఆకట్టుకుంది. అందుకే, ఈ సినిమా చూసిన తర్వాత తెలిసిన వాళ్లందరినీ ఆర్ఆర్ఆర్ చిత్రం చూశారా అని అడిగాను

by Sai
brazil president luiz da silva heaps praises on rrr movie

భారత్ లో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో( G20 Summit) ఆసక్తికర ఘటన జరిగింది. ఈ సదస్సుకు బ్రెజిల్ (Brezil)అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డసిల్వా(Lula dasilwa) కూడా విచ్చేశారు. ఢిల్లీ వచ్చిన ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ (RRR Movie) చిత్రం తనకు ఎంతగానో నచ్చిందని వెల్లడించారు.

brazil president luiz da silva heaps praises on rrr movie

భారతీయ చిత్రాల్లో ఆర్ఆర్ఆర్ నచ్చినంతగా మరే చిత్రం నచ్చలేదని తెలిపారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించారంటూ చిత్ర బృందాన్ని అభినందించారు. భారత్ పై బ్రిటీష్ ఆధిపత్యాన్ని తెలియజేస్తూ లోతైన విమర్శ చేయడాన్ని ఈ సినిమాలో అర్థవంతంగా చూపించారని కితాబిచ్చారు. మూడు గంటల నిడివి ఉన్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో అద్భుతమైన సన్నివేశాలు, అందమైన నృత్యాలు ఉన్నాయని లులా డసిల్వా వివరించారు.

“ఈ సినిమా నిజంగా నన్ను చాలా ఆకట్టుకుంది. అందుకే, ఈ సినిమా చూసిన తర్వాత తెలిసిన వాళ్లందరినీ ఆర్ఆర్ఆర్ చిత్రం చూశారా అని అడిగాను. సినిమా చూస్తున్నంత సేపు చక్కగా ఆస్వాదించాను. ఆర్ఆర్ఆర్ దర్శకుడికి, నటీనటులకు అభినందనలు తెలియజేస్తున్నాను” అని వెల్లడించారు.

“ఆర్ఆర్ఆర్ దర్శకుడికి, నటీనటులకు అభినందనలు తెలియజేస్తున్నాను” అని వెల్లడించారు.లూయిస్ వ్యాఖ్యలపై ఆర్ఆర్ఆర్ దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఆయనకు కృతఙ్ఞతలు తెలిపారు. బ్రెజిల్ అధ్యక్షుడి మాటలు.. తమ టీమ్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.

You may also like

Leave a Comment