ఇటీవల కాలంలో ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బ్రెజిల్(Brazil) కు చెందిన ఓ సింగర్(Singer) లైవ్‌లోనే స్టేజ్‌పై కుప్పకూలి అందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు. బ్రెజిల్ ఈశాన్య నగరమైన ఫీరా డి శాంటాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఊహించని ఈ పరిణామంతో ప్రదర్శనకు హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బ్రెజిల్లో గోస్పెల్ సింగర్ (Brazilian gospel singer) పెడ్రో హెన్రిక్ (Pedro Henrique) లైవ్ ప్రదర్శన (live performance) ఇస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలి మృతి చెందాడు. పెడ్రో వయసు ప్రస్తుతం 30 ఏళ్లు.
స్టేజ్‌పై లైవ్ ప్రదర్శన ఇస్తున్న సమయంలో పెడ్రో ఒక్కసారిగా కుప్పకూలిపడిపోయాడు. దీంతో అక్కడున్న వారు అతడిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే పెడ్రో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటుతోనే అతడు మృతిచెందినట్లు తెలిపారు.
బ్రెజిల్ గోస్పెల్ మ్యూజిక్‌లో రైజింగ్ స్టార్‌గా పెడ్రో పేరు సంపాదించుకున్నాడు. అతడి మృతితో హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. స్టేజ్‌పై సింగర్ కుప్పకూలిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
NEW – Brazilian gospel singer Pedro Henrique, 30, collapses and dies during a live performance — Daily Mailpic.twitter.com/evUXAz34nB
— Disclose.tv (@disclosetv) December 14, 2023