Telugu News » Telangana : స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్.. మెనూ చూశారా?

Telangana : స్కూళ్లలో బ్రేక్ ఫాస్ట్.. మెనూ చూశారా?

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు ఈ ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభం కానుంది. మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రావిర్యాల స్కూల్ లో శుక్రవారం కేసీఆర్ ఈ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తారు.

by admin
Breakfast Scheme For School Kids in Telangana

తెలంగాణ (Telangana) లోని ప్రభుత్వ స్కూళ్లలో ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ శుక్రవారం ఉదయం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెనూ విడుదల చేసింది ప్రభుత్వం. ఏ రోజున విద్యార్థులకు ఏం వడ్డించాలో అందులో ఉంది.

Breakfast Scheme For School Kids in Telangana

బ్రేక్ ఫాస్ట్ మెనూ

సోమవారం : ఇడ్లీ సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ
మంగవారం : పూరీ, ఆలూ కుర్మా లేదా టమాటా బాత్, సాంబార్
బుధవారం : ఉప్మా సాంబార్ లేదా కిచిడీ, చట్నీ
గురువారం : మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగల్, సాంబార్
శుక్రవారం : ఉగ్గాని లేదా పోహ లేదా మిల్లెట్ ఇడ్లీ లేదా చట్నీతో రవ్వ కిచిడీ
శనివారం : పొంగల్, సాంబార్ లేదా వెజ్ పులావ్, రైతా లేదా ఆలూ కుర్మా

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని తరగతుల విద్యార్థులకు ఈ ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రారంభం కానుంది. మ‌హేశ్వ‌రం నియోజ‌క‌వ‌ర్గం రావిర్యాల స్కూల్ లో శుక్రవారం కేసీఆర్ ఈ ప‌థ‌కాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 27,147 పాఠ‌శాల‌ల్లో 23 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఈ ప‌థ‌కం ద్వారా ప్ర‌యోజ‌నం పొంద‌నున్నారు.

పాఠ‌శాల ప్రారంభానికి 45 నిమిషాల ముందే అల్పాహారం అందివ్వ‌నున్నారు. దీనికి సంబంధించి కొన్ని స్కూళ్లలో టైమింగ్స్ లో మార్పులు ఉన్నాయి. ప్రైమ‌రీ స్కూల్స్ లో బ్రేక్ ఫాస్ట్ టైమ్ ఉద‌యం 8.45 గంట‌ల నుంచి ప్రారంభం అవుతుండగా.. హైద‌రాబాద్, సికింద్రాబాద్ ప‌రిధిలోని స్కూల్స్ లో ఉద‌యం 8 గంట‌ల నుంచి అందిస్తారు.

You may also like

Leave a Comment