Telugu News » ‘Khushi’ Kapoor : శ్రీదేవి చిన్న కూతురు కోలీవుడ్ ఎంట్రీ..!?

‘Khushi’ Kapoor : శ్రీదేవి చిన్న కూతురు కోలీవుడ్ ఎంట్రీ..!?

శ్రీదేవి...దశాబ్ధాల పాటు భారతీయ సినిమాను ఏలిన నటీమణి.ఆమె భౌతికంగా దూరమైనా సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె ఇద్దరు కుమార్తెలు సినీరంగ ప్రవేశం చేశారు.

by sai krishna

శ్రీదేవి…దశాబ్ధాల పాటు భారతీయ సినిమాను ఏలిన నటీమణి.ఆమె భౌతికంగా దూరమైనా సినీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె ఇద్దరు కుమార్తెలు సినీరంగ ప్రవేశం చేశారు.


పెద్ద కుమార్తె జాన్వీ కపూర్(Janhvi Kapoor)…ఇప్పటికే పలు చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా ‘దేవర’ చిత్రంలో నటిస్తోంది. అందుకు సంబంధించిన చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.


మరో వైపు శ్రీదేవి చిన్న కుమార్తె ఖుషీ కపూర్‌ కూడా‘ది అర్చీస్‌(The Archies)’తో నటిగా తెరంగేట్రం చేసింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలోఉన్న మ్యూజికల్‌ కామెడీ ఫిల్మ్‌. తాజాగా ఖుషీ కపూర్‌ త్వరలో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.


కోలీవుడ్‌ నటుడు అధర్వ(Atharva) హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాలో ఖుషీ కపూర్ కథానాయికగా కనిపించనున్నారని సమాచారం.విఘ్నేశ్‌ శివన్‌(Vignesh Sivan)వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన ఆకాశ్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడని తెలుస్తోంది. ఫీల్‌గుడ్‌ లవ్ స్టోరీగా ఈ చిత్రం తెరకెక్కనుంది. అనిరుధ్‌ స్వరాలు అందించనున్నాడట. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

You may also like

Leave a Comment