ఏపీ (AP)లో కాంగ్రెస్ (Congress) పార్టీ దూకుడు పెంచింది.. విజయమే లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎన్నికల బరిలోకి దిగే మొదటి అభ్యర్థుల లిస్ట్ ప్రకటించిన హస్తం.. తాజాగా అభ్యర్థుల రెండో జాబితాను పార్టీ హైకమాండ్ నేడు విడుదల చేసింది. లోక్సభ (Lok Sabha)కు 6, అసెంబ్లీ (Assembly)కి 12 మంది అభ్యర్థుల జాబితాను ప్రస్తుతం అనౌన్స్ చేసింది.
ఇక ఎన్నికల పోరులో నిలిచే ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టు గమనిస్తే.. టెక్కలి-కిల్లి కృపారాణి.. నర్సిపట్నం-రామమూర్తి.. గోపాలపురం-మార్టిన్ లూథర్.. గంగాధర నెల్లూరు-రమేష్ బాబు.. పూతల పట్టు-ఎంఎస్ బాబు.. గాజువాక-లక్కరాజు రామారావు.. అరకు-గంగాధర స్వామి మొదలగు ఈ ఏడుగురితో పాటుగా.. మరో ఐదుగురిని ప్రకటించింది.
మరోవైపు ఎంపీ అభ్యర్థులను సైతం ప్రకటించింది. ఆ వివరాలు చూస్తే.. తిరుపతి నుంచి చింత మోహన్.. విశాఖ-సత్యనారాయణరెడ్డి.. అనకాపల్లి-వేగి వెంకటేష్.. ఏలూరు-కావూరి లావణ్య.. నరసరావు పేట-సుధాకర్.. నెల్లూరు-కొప్పుల రాజు.. మొదలగు ఆరుగురిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. అలాగే ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గానూ తొలి విడతలో 114 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది.
మరోవైపు 25 ఎంపీ సీట్లకు గానూ 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే అందరూ ఊహించిన విధంగానే వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. అదేవిధంగా ఇక్కడి నుంచి వైసీపీ తరపున ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా.. షర్మిల తన సోదరుడితోనే తలపడుతున్న సంగతి తెలిసిందే..