Telugu News » Britain : రిషి సునాక్ కీలక నిర్ణయం.. భారతీయులపై భారీగా ఎఫెక్ట్..!!

Britain : రిషి సునాక్ కీలక నిర్ణయం.. భారతీయులపై భారీగా ఎఫెక్ట్..!!

బ్రిటన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ముఖ్యంగా ఆరోగ్య రంగంలో పని చేయడానికి వెళ్లిన వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు తెలుస్తుంది. కఠిన నిబంధనల వల్ల వారు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్‌ తీసుకురాలేరని తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుత వలసల్లో 3లక్షల మంది వరకు తగ్గుతారని మంత్రి క్లెవర్లీ చెప్పారు.

by Venu

విదేశాలకు వెళ్లాలనుకునే వారికి షాక్ తగిలింది. దేశంలో విపరీతంగా పెరుగుతున్న వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్‌ (Britain) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపాధి వీసాను మరింత కఠినతరం చేయాలని రిషి సునాక్ (Rishi Sunak) సర్కారు నిర్ణయించింది. ఈమేరకు అత్యధిక వేతనాలున్న విదేశీ వృత్తి నిపుణులకే వీసాలివ్వాలని, డిపెండెంట్లుగా వచ్చే భాగస్వాములకు కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

బ్రిటన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ముఖ్యంగా ఆరోగ్య రంగంలో పని చేయడానికి వెళ్లిన వృత్తి నిపుణులపై తీవ్ర ప్రభావం పడుతున్నట్టు తెలుస్తుంది. కఠిన నిబంధనల వల్ల వారు తమ కుటుంబ సభ్యులను బ్రిటన్‌ తీసుకురాలేరని తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుత వలసల్లో 3లక్షల మంది వరకు తగ్గుతారని మంత్రి క్లెవర్లీ చెప్పారు.

ఈ మేరకు బ్రిటన్‌ హోంశాఖ మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ (James Cleverly) సోమవారం హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతీయులపై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఇక బ్రిటన్‌లో వృత్తి నిపుణుల వీసా పొందడానికి గతంలో ఏడాదికి 26,200 పౌండ్ల వేతనం ఉంటే సరిపోయేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం ఆ వేతనం 38,700 పౌండ్లు ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గతంలో కుటుంబ వీసా కోసం 18,600 పౌండ్ల వేతనం ఉంటే సరిపోయేది. కానీ బ్రిటన్ ప్రభుత్వం దానినీ 38,700 పౌండ్లకు పెంచింది. భవిష్యత్తులో విద్యార్థి వీసాలపై కూడా ఆంక్షలు అమలు చేయనున్నట్లు బ్రిటన్ మంత్రి క్లెవర్లీ ప్రకటించారు.

You may also like

Leave a Comment