Telugu News » BRS : రేవంత్ పై బీఆర్ఎస్ ఎదురుదాడి

BRS : రేవంత్ పై బీఆర్ఎస్ ఎదురుదాడి

రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదని, తెలంగాణకు పట్టిన వ్యాధి అని విమర్శలు గుప్పించారు.

by admin

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ (BRS) నేతలు వరుసగా ఎదురుదాడి చేస్తున్నారు. నిజామాబాద్ పర్యటనలో మంత్రి కేటీఆర్ (KTR) మాట్లాడుతూ.. మంగళవారం రేవంత్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై రైఫిళ్లతో దాడికి దిగిన రేవంత్.. ఇవాళ తాను నిఖార్సైన తెలంగాణ వాది అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ వాది కాదని, తెలంగాణకు పట్టిన వ్యాధి అని విమర్శలు గుప్పించారు.

brs attack on revanth reddy

హంతకుడే సంతాపం చెప్పినట్లుగా కాంగ్రెస్ నేతలు వాగుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. 50 ఏళ్లు అధికారంలో ఉన్న హస్తం నేతలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా గుడ్డి గుర్రాల పళ్లు తోమారా అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరెంట్, నీళ్లు ఇవ్వకుండా రైతులను చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదా అని ప్రశ్నించారు. దిక్కుమాలిన కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు మళ్లీ కష్టాలు తప్పవని, ఒక్క బీఆర్ఎస్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెలిపారు కేటీఆర్.

మంత్రి జగదీష్ రెడ్డి (Jagadish Reddy) మీడియాతో మాట్లాడుతూ.. పిండాలు పెట్టి ప్రజలను హింసించిన చరిత్ర కాంగ్రెస్, టీడీపీలదేనని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రజలకు పిండాలు పెట్టిన టీడీపీ, కాంగ్రెస్‌ లకు చెందిన వాడు కనుకే పిండాల గురించి మాట్లాడుతుంటారని ఫైరయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి చిల్లర మాటలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. దివంగత మాజీ ప్రధాని, తెలంగాణ బిడ్డ పీవీకి సరైన అంత్యక్రియలు నిర్వహించని సంస్కారం లేని పార్టీకి ఆయన అధ్యక్షుడని ఘాటుగా విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజల చేతిలో రేవంత్ కు భంగపాటు తప్పదని హెచ్చరించారు.

రేవంత్ చేసిన వ్యాఖ్యలు

కాంగ్రెస్ లేకపోతే కేసీఆర్ కుటుంబం బిచ్చమెత్తుకునేది. టీడీపీ, కాంగ్రెస్ లేకుంటే.. నాంపల్లి దర్గా, బిర్లా మందిర్, మెదక్ చర్చి ముందు చిప్పలు పట్టుకుని అడ్డుకునే వాళ్లు. కేసీఆర్‌‌‌‌ ని కేంద్రమంత్రిని చేసిందే కాంగ్రెస్. కేసీఆర్ కుటుంబం ఇప్పుడు అనుభవిస్తున్నదంతా కాంగ్రెస్ భిక్షే. 1996లో 610 జీవో, జోనల్ వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడిన ద్రోహి కేసీఆర్. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 25 సీట్లకు మించి రావు. అందుకే, కాంగ్రెస్‌‌ పై కేసీఆర్ దాడి చేస్తున్నారు. అసెంబ్లీని చిల్లర రాజకీయాలకు వేదికగా కేసీఆర్ అండ్ కో మార్చారు. నా ప్రస్థానం టీడీపీలో చంద్రబాబు సహచరుడిగా మొదలైంది. ఎమ్మెల్సీగా గెలిచాకే టీడీపీలో చేరాను. కానీ, నిలువ నీడ లేని కేసీఆర్‌‌‌‌ కు టీడీపీనే ఆధారమైంది. కేసీఆర్ చంద్రబాబుతో ఉన్నప్పుడు 610 జీవోపై తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీసేలా వ్యవహరించారు.

You may also like

Leave a Comment