Telugu News » Balka Suman : మా కష్టాలు మీకు అవసరం లేదు.. బీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోస్తున్న రైతులు..!!

Balka Suman : మా కష్టాలు మీకు అవసరం లేదు.. బీఆర్ఎస్ పై దుమ్మెత్తి పోస్తున్న రైతులు..!!

ఎన్నికల ప్రచారంలో భాగంగా బాల్క సుమన్ చెన్నూర్ (Chennur) నియోజకవర్గం సందర్శించారు. ప్రచారంలో భాగంగా కిష్టాపూర్ గ్రామానికి వెళ్తుండగా..ఆ గ్రామ రైతులు అడ్డుకుని నిరసనకు దిగారు. గ్రామంలో రావొద్దంటూ.. ఊరి బయట ప్లకార్డులు పట్టుకొని అడ్డుగా ఉన్నారు..

by Venu

తెలంగాణ (Telangana)లో బీఆర్ఎస్ (BRS) మరోసారి అధికారంలోకి రావాలని చేస్తున్న ప్రయత్నాల పై నిరసనలు, నీళ్ళు చల్లుతున్నాయని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రచారానికి వెళ్తున్న పలు చోట్ల చేదు అనుభవాలు ఎదురవుతున్నట్టు నిత్యం వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా ఉండగా.. ఈ ఎన్నికల్లో తన చరిష్మాను నిరూపించుకోవాలని ఆరాటపడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కు (Balka Suman) నిరసన సెగలు చుట్టూ ముట్టాయి..

ఎన్నికల ప్రచారంలో భాగంగా బాల్క సుమన్ చెన్నూర్ (Chennur) నియోజకవర్గం సందర్శించారు. ప్రచారంలో భాగంగా కిష్టాపూర్ గ్రామానికి వెళ్తుండగా..ఆ గ్రామ రైతులు అడ్డుకుని నిరసనకు దిగారు. గ్రామంలో రావొద్దంటూ.. ఊరి బయట ప్లకార్డులు పట్టుకొని అడ్డుగా ఉన్నారు.. బాల్క సుమన్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని నిరసన తెలుపుతున్న రైతులను అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తూతూ మంత్రంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన బాల్క సుమన్ వెనుతిరిగి వెళ్లి పోయారు.

తమ సమస్యల గురించి ఎన్నిసార్లు చెప్పిన బాల్క సుమన్ పట్టించుకోలేదని స్థానిక రైతులు ఆరోపించారు. కిష్టాపూర్ శివారు సర్వే నెంబర్ 50లో ఏళ్ల తరబడి ఉన్న భూ సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.. కొంత మందికి రైతు బంధు, చనిపోయిన రైతు కుటుంబాలకు రైతు బీమా కూడా రాలేదని వెల్లడించారు..

నాలుగేళ్ల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ తో గ్రామంలోని 4వందల ఎకరాల పంట పొలాలు నీటి మునిగిపోతుంటే.. ప్రభుత్వం కాని.. బాల్క సుమన్ కాని పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఆరోపించారు.. నష్టపోయిన పంటకు ఇప్పటి వరకు నష్ట పరిహారం కూడా చెల్లంచలేదని రైతులు తెలిపారు. ఎన్నికలు రాగానే ఓట్లు అడిగేందుకు మాత్రం ఎగేసుకుంటూ వస్తారని రైతులు మండిపడుతున్నారు.. మా కష్టాలు నేతలకు అవసరం లేదని పదవులు మాత్రం ఉంటే చాలని రైతులు ఆవేదనపడుతున్నారు..

You may also like

Leave a Comment