Telugu News » Tamilisai : గవర్నరా.. బీజేపీ ప్రతినిధా.. తమిళిసైపై బీఆర్ఎస్ ఎటాక్!

Tamilisai : గవర్నరా.. బీజేపీ ప్రతినిధా.. తమిళిసైపై బీఆర్ఎస్ ఎటాక్!

కేబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వాల‌ను గ‌వ‌ర్న‌ర్ ఎలా తిరస్క‌రిస్తారని ప్ర‌శ్నించారు మంత్రి హరీష్ రావు. త‌మిళిసై ఆది నుంచి తెలంగాణ ప్ర‌గ‌తికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నారని ఆరోపించారు.

by admin

గ‌వ‌ర్న‌ర్ కోటా ఎమ్మెల్సీలుగా కేబినెట్ సిఫార‌సు చేసిన పేర్ల‌ను గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రించ‌డంకపై బీఆర్ఎస్ (BRS) భగ్గుమంది. వరుసగా గులాబీ నేతలు గవర్నర్ ను టార్గెట్ చేస్తూ విమర్శల దాడికి దిగారు. సోషల్ వర్క్ రాజకీయాలు విభిన్నమైన పాత్రలు, ప్రయోజనాలను కలిగి ఉంటాయని తెలిపారు దాసోజు శ్రవణ్ (Dasoju Sravan). కానీ, అవి పరస్పర విరుద్ధమైనవి కావని పేర్కొన్నారు. విధాన పరమైన మార్పుల కోసం సామాజిక కార్యకర్తలు న్యాయవాద లాబీయింగ్‌ పాత్ర పోషిస్తారని చెప్పుకొచ్చారు. రాజకీయ నాయకులు చట్టం ద్వారా సామాజిక సమస్యలను పరిష్కరించడానికి పని చేయవచ్చని వివరించారు. సంక్లిష్టమైన సామాజిక సమస్యలను పరిష్కరించేటప్పుడు రెండు రంగాలు తరచుగా కలుస్తాయని తెలిపారు శ్రవణ్.

telangana kcr tamilisai

కేబినెట్ ఆమోదించిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వాల‌ను గ‌వ‌ర్న‌ర్ ఎలా తిరస్క‌రిస్తారని ప్ర‌శ్నించారు మంత్రి హరీష్ రావు (Harish Rao). త‌మిళిసై (Tamilisai) ఆది నుంచి తెలంగాణ ప్ర‌గ‌తికి వ్య‌తిరేకంగా ప‌ని చేస్తున్నారని ఆరోపించారు. అసలు ఆమె.. గ‌వ‌ర్న‌రా? బీజేపీ ప్ర‌తినిధా? అంటూ మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్నారని.. సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని రాజ్య‌స‌భ‌కు బీజేపీ ఎలా నామినేట్ చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి (Prashant Reddy) స్పందిస్తూ.. త‌మిళ‌నాడు బీజేపీ అధ్య‌క్షురాలిగా ఉండి త‌మిళిసై గ‌వ‌ర్న‌ర్‌ గా నామినేట్ అయ్యార‌ని గుర్తు చేశారు. ఈ నియామకం కూడా స‌ర్కారియా క‌మిష‌న్‌ కు విరుద్ధ‌మ‌న్నారు. త‌మిళిసై కు గ‌వ‌ర్న‌ర్‌ గా కొన‌సాగే నైతిక హ‌క్కు లేదన్న ఆయన.. త‌క్ష‌ణ‌మే ప‌ద‌వి నుంచి వైదొల‌గాల‌ని డిమాండ్ చేశారు. దాసోజు శ్ర‌వ‌ణ్‌, కుర్రా స‌త్యనారాయ‌ణ సామాజిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌వారే అని స్ప‌ష్టం చేశారు. కేబినెట్ సిఫార‌సు చేసిన పేర్ల‌ను గ‌వ‌ర్న‌ర్ తిర‌స్క‌రించ‌డం స‌రికాద‌న్నారు.

ఏ ప్ర‌తిపాదిక‌న అభ్య‌ర్థిత్వాల‌ను తిర‌స్క‌రించారో గ‌వ‌ర్న‌ర్ స్ప‌ష్టం చేయాల‌ని ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి (Madhusudanachari) డిమాండ్ చేశారు. కేబినెట్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకించే అధికారం గ‌వ‌ర్న‌ర్‌ కు లేద‌ని స్ప‌ష్టం చేశారు. దాసోజు శ్ర‌వ‌ణ్‌, కుర్రా స‌త్యనారాయ‌ణ ఎమ్మెల్సీ అభ్య‌ర్థిత్వాల‌ను తిర‌స్క‌రించ‌డం అప్ర‌జాస్వామికం అని పేర్కొన్నారు.

You may also like

Leave a Comment