బీఆర్ఎస్ (BRS )కు షాక్ తగిలింది. బీఆర్ఎస్ నేత, ఖానాపూర్ (Khanapur) ఎమ్మెల్యే రేఖా నాయక్ (Rekha Naik) ఆ పార్టీకి రాజీనామా (Resign) చేశారు. అనంతరం బీఆర్ఎస్ పై రేఖా నాయక్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఖానాపూర్లో బీఆర్ఎస్ ఎలా గెలుస్తుందో తాను చూస్తానన్నారు. కేటీఆర్ ( KTR) ఫ్రెండ్ కోసం తనకు టికెట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆమె వాపోయారు.
రాబోయే ఎన్నికల్లో తానేంటో బీఆర్ఎస్ కు చూపిస్తానంటూ హెచ్చరించారు. పార్టీకి రాజీనామా అనంతరం ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్లో మహిళలకు విలువలేదంటూ తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. ఖానాపూర్ లో మరో నేత గెలిచే అవకాశం లేదన్నారు. ఖానాపూర్ గడ్డ రేఖా నాయక్ అడ్డ అని గర్జించారు. ఈ సారి తాను ఒంటిరిగా పోటీ చేసి బీఆర్ఎస్ కు ఝలక్ ఇస్తాన్నారు.
తానేం తప్పు చేశానంటూ బీఆర్ఎస్ ను ఆమె నిలదీశారు. తాను ఏమైనా కుంభకోణాలు చేశానా? అంటూ ప్రశ్నించారు. తన నియోజక వర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కూడా ఇవ్వడం లేదంటూ వాపోయారు. ఎస్టీ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సర్కార్ వివక్ష చూపుతోందని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఖానా పూర్ లో మరో నేత గెలవకుండా తాను చూస్తానన్నారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కు ఇటీవల బీఆర్ఎస్ షాక్ ఇచ్చింది. ఖానాపూర్ టికెట్ ను రేఖానాయక్ ను కాదని కేటీఆర్ బాల్య మిత్రుడు జాన్సన్ నాయక్ కు బీఆర్ఎస్ అధిష్టానం కేటాయించింది. దీంతో గత కొంతకాలంగా ఆమె అసంతృప్తిగా వుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమె బీర్ఎస్ ను వీడుతున్నట్టు ప్రకటించారు. ఆమె భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోందనే విషయంపై అంతా ఆసక్తిగా చూస్తున్నారు.