Telugu News » BRS KTR : ఆ వార్తలు బాధాకరం.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా నిల‌వాలి..!!

BRS KTR : ఆ వార్తలు బాధాకరం.. కాంగ్రెస్ ప్ర‌భుత్వం అండ‌గా నిల‌వాలి..!!

గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే.. ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వ సహకారం ఉంటే, తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే సత్తా ఉన్నట్టు వెల్లడించారు.

by Venu
KTR: Congress is a nickname for hypocritical ethics.. KTR's tweet is viral..!

సిరిసిల్ల (Siricilla) వ‌స్త్ర పరిశ్రమపై వ‌స్తున్న సంక్షోభ వార్తలపై ట్విట్టర్ ఎక్స్ (X) వేదికగా కేటీఆర్ (KTR) స్పందించారు. గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ (BRS) ప్ర‌భుత్వం అందించిన స‌హ‌కార‌ం వల్ల సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. ఎంతో నైపుణ్యం కలిగిన పవర్లూమ్ నేతన్నలు, అభివృద్ధి చెందడమే కాకుండా తమ కార్యకలాపాలను విస్తరించారని గుర్తు చేశారు.

ktr participated in the preparatory meeting of warangal lok sabha constituency

ఇందుకు ప్రధాన కారణం కేసీఆర్ (KCR) నేతృత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమేనని పేర్కొన్నారు.. గత 15 రోజులుగా చేనేత రంగానికి సంబంధించి వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించకుంటే ఈ పరిశ్రమ తీవ్రమైన సంక్షోభంలోకి వెళ్తుందని తెలిపారు.. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు అండగా నిలవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వం ప్రారంభించిన వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తూనే.. ఈ పరిశ్రమ బలోపేతానికి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వ సహకారం ఉంటే, తమిళనాడులో ఉన్న తిరుపూర్ వస్త్ర పరిశ్రమతో సమానంగా పోటీ పడగలిగే సత్తా ఉన్నట్టు వెల్లడించారు. మరోవైపు సోమవారం నుంచి సిరిసిల్లలోని పాలిస్టర్ వస్త్ర పరిశ్రమను మూసివేయాలని.. పరిశ్రమ యజమానులు నిర్ణయం తీసుకొన్నారు.

దీంతో వేలాది కార్మికుల ఉపాధిపై ఎఫెక్ట్ పడనుంది. దేశవ్యాప్తంగా వస్త్ర పరిశ్రమలో సంక్షోభం, కొత్త ఆర్డర్లు లేకపోవడంతో పరిశ్రమను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఇప్పటికే స్పందించారు. వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక సిరిసిల్ల స్వయంగా కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజక వర్గం..

You may also like

Leave a Comment