Telugu News » BRS: మేనిఫెస్టో ప్రకటన.. సీఎం కేసీఆర్ వరాల జల్లు!

BRS: మేనిఫెస్టో ప్రకటన.. సీఎం కేసీఆర్ వరాల జల్లు!

రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని  కేసీఆర్‌ ప్రకటించారు. రైతు బంధు పథకాన్ని దశలవారీగా రూ.16 వేల వరకు పెంచుతామన్నారు.

by Mano
BRS: Manifesto announcement.. CM KCR's blessings!

BRS: తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్(KCR) బీఆర్ఎస్(BRS) మేనిఫెస్టోను విడుదల చేస్తున్నారు.  తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో కేసీఆర్ వరాల జల్లును కురిపించారు. మేనిఫెస్టోలో భాగంగా దళితబంధు పథకాన్ని కొనసాగిస్తామని చెప్పారు. తెలంగాణ(TELANGANA) లో మళ్లీ అధికారంలోకి వస్తే ఆర్హులైన వారందరికీ రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని  కేసీఆర్‌ ప్రకటించారు. రైతు బంధు పథకాన్ని దశలవారీగా రూ.16 వేల వరకు పెంచుతామన్నారు.

BRS: Manifesto announcement.. CM KCR's blessings!

అదేవిధంగా అర్హులైన పేద మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకు రూ.3 వేల భృతి ఇస్తామన్నారు. ఆసరా పింఛన్ల మొత్తాన్ని ఏటా రూ.500 చొప్పున రూ.5 వేల వరకు పెంచుతామని కేసీఆర్‌ హమీ ఇచ్చారు. కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరిట రూ.15 లక్షల వరకు బీమా పథకం అమలు చేస్తామన్నారు. గిరిజనేతరులకు పోడు పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. మైనార్టీ బడ్జెట్ పెంపు, మైనార్టీ జూనియర్ కాలేజీలు డిగ్రీ కళాశాలలుగా మార్పు, ప్రస్తుతం బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కూడా కొనసాగిస్తామని ప్రకటించారు.

అదేవిధంగా ప్రస్తుతం బీసీలకు అమలు చేస్తున్న పథకాలు కూడా కొనసాగిస్తామన్నారు. యువతకు విదేశీ విద్యకు ప్రోత్సహాం అందిస్తామని చెప్పారు. ఈ పథకంతో 90లక్షల మంది లబ్ధి పొందుతారని చెప్పారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ అన్నపూర్ణ పేరుతో సన్న బియ్యం అందిస్తామన్నారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదిలో ఎకరానికి రూ.12వేలకు పెంచుతామన్నారు. దీన్ని క్రమంగా రూ.16వేల వరకు తీసుకెళ్తామని చెప్పారు.

You may also like

Leave a Comment