Telugu News » Pocharam : హరీష్ రావు కేటీఆర్ కు తెలియకుండా కేసీఆర్ ఎంత పని చేశాడు..?

Pocharam : హరీష్ రావు కేటీఆర్ కు తెలియకుండా కేసీఆర్ ఎంత పని చేశాడు..?

కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వెల్లడిస్తున్నాయని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. పోలింగ్ పూర్తి కాకముందే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు. సైలెంట్ ఓటు కేసీఆర్ కు అనుకూలంగా ఉందన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్ఎస్ 70 నుంచి 75 సీట్లు సాధించడం పక్క అని జోస్యం చెప్పారు.

by Venu

రాజకీయాల్లో ఒడిదుడుకులు సర్వసాధారణమే.. అయిన తెలంగాణలో ప్రస్తుతం జరిగిన ఎన్నికలు ప్రెస్టేజ్ ఇష్యూగా మారినట్టు తెలుస్తుంది. తిరుగులేని నేతగా తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలిన కేసీఆర్.. ప్రస్తుతం ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. బొమ్మ హిట్టా ఫట్టా తెలియాలంటే ఇంకా కొన్ని గంటలు ఆగవలసిందే.. అయితే ప్రస్తుతం నెగటివ్ టాక్ ఫామ్ కాకుండా బీఆర్ఎస్ (BRS) నేతలు ప్రయత్నిస్తున్నారని జనం అనుకుంటున్నారు..

ఈ క్రమంలో ఎన్నికల రిజల్ట్ పై పాజిటివ్ వైబ్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్.. ఈ నేపథ్యంలో గెలుపు ఓటమిలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ వేరు.. ఎక్జాట్ పోల్స్ వేరని తెలిపారు. కేసీఆర్ (KCR) మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారని పోచారం ధీమా వ్యక్తం చేశారు..

కొన్ని ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు వెల్లడిస్తున్నాయని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. పోలింగ్ పూర్తి కాకముందే ఎగ్జిట్ పోల్స్ ఎలా ఇస్తారు..? అని ప్రశ్నించారు. సైలెంట్ ఓటు కేసీఆర్ కు అనుకూలంగా ఉందన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్ఎస్ 70 నుంచి 75 సీట్లు సాధించడం పక్క అని జోస్యం చెప్పారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్ మరోసారి సీఎం కావాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు..

మరోవైపు బీఆర్ఎస్ అధికారంలోకీ వస్తే కేసీఆర్ పెద్ద పదవి ఇస్తానన్నారని బాంబ్ పేల్చారు పోచారం శ్రీనివాస్ రెడ్డి.. ఈ విషయం హరీష్ రావుకు కేటీఆర్ (KTR)కు కూడా తెలియదన్నారు. మనసులో మాట కేసీఆర్ నాతో పంచుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు పోచారం శ్రీనివాస్ రెడ్డి..

You may also like

Leave a Comment