Telugu News » Palla Rajeshwar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం కూలి పోతోంది.. క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?

Palla Rajeshwar Reddy : కాంగ్రెస్ ప్రభుత్వం కూలి పోతోంది.. క్లారిటీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే..?

అయినా రాయిని నీటిలో ఎంత నానబెట్టిన అది నానదు.. అలాగే అధికారం కోసం అలమటిస్తోన్న బీఆర్ఎస్ కి, పాలన ఎంత చక్కగా చేసిన రుచించదు.. తమ అవినీతి ఎక్కడ భయటపడుతోందనే టెన్షన్ లో, నోటికి వచ్చినట్టు వాగుతున్నారని కొందరు మాట్లాడుకొంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం బీఆర్ఎస్ నేతల మాటలను సీరియస్ గా తీసుకొన్నట్టు సమాచారం..

by Venu

తెలంగాణ (Telangana) రాష్ట్రంలో అధికార పార్టీ హస్తం.. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య ఫ్రెండ్లీ వాతావరణం నెలకొంటోందని అంతా భావిస్తోన్న సమయంలో రెండు పార్టీల మధ్య.. కొందరు గులాబీ నేతలు చేస్తోన్న ఆరోపణల వల్ల నిప్పు రాజుకొంటుందనే గుసగుసలు వినిపిస్తోన్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం అధికారంలో ఉండదని.. త్వరలో రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ అని కొందరు చేస్తోన్న ప్రచారం రాజకీయ వర్గాలలో ప్రకంపనాలను సృష్టిస్తోన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ (BRS) ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి (Palla Rajeshwar Reddy) తెలంగాణ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ కూలి పోతోందని అనలేదని.. తను అనని మాటలు అన్నట్టు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ (Congress) ప్రభుత్వంపై ఎటువంటి కామెంట్స్ చేయలేదని పల్లా తెలిపారు. మరోవైపు బీజేపీ (BJP) ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కడియం కూడా బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏడాదిలోపే అధికారంలోకి వస్తుందని చెప్పి షాక్ ఇచ్చారు. ఇలా వరుసగా బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారాయి..

అయినా రాయిని నీటిలో ఎంత నానబెట్టిన అది నానదు.. అలాగే అధికారం కోసం అలమటిస్తోన్న బీఆర్ఎస్ కి, పాలన ఎంత చక్కగా చేసిన రుచించదు.. తమ అవినీతి ఎక్కడ భయటపడుతోందనే టెన్షన్ లో, నోటికి వచ్చినట్టు వాగుతున్నారని కొందరు మాట్లాడుకొంటున్నట్టు టాక్ వినిపిస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం బీఆర్ఎస్ నేతల మాటలను సీరియస్ గా తీసుకొన్నట్టు సమాచారం..

You may also like

Leave a Comment