బీఆర్ఎస్ (BRS) నుంచి టికెట్ దక్కకపోవడంతో ఎమ్మెల్యే రేఖా నాయక్ (Rekha Naik) కీలక నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ (Congress) టికెట్ కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. ఖానాపూర్ (Khanapur) అసెంబ్లీ టికెట్ కోసం తన పీఏ ద్వారా ఈ అప్లికేషన్ ను పంపించారు రేఖా నాయక్. గాంధీ భవన్ కు వెళ్లిన పీఏ దరఖాస్తు పత్రాలను అందజేశారు. ఇటు ఆసిఫాబాద్ (Asifabad) టికెట్ కోసం ఆమె భర్త శ్యాం నాయక్ దరఖాస్తు చేసుకున్నారు.
శ్యాం నాయక్ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. జూబ్లీహిల్స్ లోని రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాసంలో ఆయన్ను కలవగా.. పార్టీ కండువా కప్పి ఆయన్ను ఆహ్వానించారు రేవంత్. కేసీఆర్ (KCR) ప్రకటించిన బీఆర్ఎస్ అభ్యర్ధుల జాబితాలో రేఖా నాయక్ కు ఈసారి ఛాన్స్ దక్కలేదు. జాన్సన్ నాయక్ కు చోటు కల్పించారు. సీటు కోల్పవడంతో రేఖా నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఆమె భర్త శ్యాం నాయక్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
సోమవారం తొలి జాబితాలో 115 మంది అభ్యర్థులకు టికెట్లు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. సిట్టింగుల్లో చాలా మందికి చోటు దక్కదనే ప్రచారం జరిగినా.. ఆ అంచనాలను తారు మారు చేస్తూ స్వల్ప మార్పులు మాత్రమే చేసిన కేసీఆర్.. అభ్యర్థుల వివరాలను ప్రకటించారు. సీట్లు దక్కని వారు ఒక్కొక్కరుగా తమ నిరసన స్వరాన్ని వినిపిస్తున్నారు.