లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ (BRS) దూకుడు పెంచింది. ఒకవైపు ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తోంది. మరో వైపు అభ్యర్థుల పేర్లను అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రకటించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 16 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా హైదరాబాద్(Hyderabad) నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి(BRS Candidate) ఖరారు చేసింది.
హైదరాబాద్ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. దీంతో బీఆర్ఎస్ అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. మాజీ సీఎం కేసీఆర్ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులతో చర్చించిన పిదప ఆయన అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు సమాచారం. మరోవైపు బీఆర్ఎస్ ఈసారి బీసీలకు పెద్దపీట వేసినట్లుగా కనిపిస్తోంది.
బీసీలకు ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీచేసే అవకాశాన్ని కల్పించారు కేసీఆర్. బీసీల్లోనూ మున్నూరుకాపులకు రెండు (జహీరాబాద్, నిజామాబాద్) పార్లమెంట్ స్థానాలు కేటాయించగా, చేవెళ్ల స్థానాన్ని ముదిరాజ్‌లకు, సికింద్రాబాద్‌ను గౌడ సామాజికవర్గానికి, భువనగిరి, హైదరాబాద్ స్థానాలను యాదవులకు కేటాయించారు. అదేవిధంగా మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, మల్కాజిగిరి స్థానాలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించారు.
మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ కడియం కావ్య, జహీరాబాద్ గాలి అనిల్‌కుమార్ పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, మల్కాజిగిరి రాగిడి లక్ష్మారెడ్డి, ఖమ్మం నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్ మాలోత్ కవిత, కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌లను బరిలోకి దింపారు.
మహబూబ్‌నగర్ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి , చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ కడియం కావ్య, జహీరాబాద్ గాలి అనిల్‌కుమార్ పోటీ చేస్తున్నారు. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు, మల్కాజిగిరి రాగిడి లక్ష్మారెడ్డి, ఖమ్మం నామా నాగేశ్వర్‌రావు, మహబూబాబాద్ మాలోత్ కవిత, కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌లను బరిలోకి దింపారు.
నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్, సికింద్రాబాద్ పద్మారావుగౌడ్, నాగర్‌కర్నూల్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, భువనగిరి క్యామ మల్లేశ్, నల్లగొండ కంచర్ల కృష్ణారెడ్డి, మెదక్ వెంకట్రామిరెడ్డి, హైదరాబాద్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ బరిలో నిలిచారు. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, సికింద్రాబాద్ పద్మారావుగౌడ్, నాగర్‌కర్నూల్ నుంచి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, భువనగిరి క్యామ మల్లేశ్, నల్లగొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి, మెదక్ నుంచి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు.